India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గ్రూప్-1 మెయిన్స్ సెలక్షన్‌ను 1:50 నిష్పత్తికి బదులుగా 1:100కి మారిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని CMO ప్రకటనలో తెలిపింది. అలాగే పరీక్ష ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రూప్-2, 3 పోస్టుల పెంపు సాధ్యపడదని తెలిపింది. ఒకవేళ గ్రూప్-1 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచే అవకాశం ఉన్నా గ్రూప్-2, 3కి అలాంటి సౌకర్యం లేదని పేర్కొంది.
AP: రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న MLC కవితతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని, ఈ కేసు విషయంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆమెకు చెప్పారు. కాగా కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీశ్ ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాదులతో కలిసి సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలపై ఐఎస్ఐ మార్కును కేంద్రం తప్పనిసరి చేసింది. వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో వినియోగదారులకు భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ISI మార్క్ లేని పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకం, నిల్వపై నిషేధం ఉన్నట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తెలిపింది. కాగా మార్చి 14న కేంద్రం ఆధ్వర్యంలోని DPIIT వంటపాత్రలపై నాణ్యత ప్రమాణ ఉత్తర్వులు జారీ చేసింది.
TG: నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలికావద్దని సూచించారు. DSC, గ్రూప్-2 పరీక్షల తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగులపై ప్రేమ, గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువతను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ‘తెల్ల దొరల కన్నా దారుణంగా పాలిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాకంఠక పాలన. నిరుద్యోగ యువతను నమ్మించి వంచించింది. ఉద్యోగాలు ఇవ్వలేకపోయినందుకు వెంటనే ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
AP: మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. అదనపు విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరగా.. మాచర్ల న్యాయస్థానం జడ్జి రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
దేశంలో ఓ రైల్వే స్టేషన్‌కు పేరు లేదనే విషయం మీకు తెలుసా? దానికి నేమ్ బోర్డు లేకపోయినా రైళ్లు అక్కడ ఆగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని రైనా & రైనాగఢ్ అనే రెండు గ్రామాల మధ్య ఇది ఉంది. దీనికి రైనాగఢ్ స్టేషన్‌గా పేరు పెట్టారు. స్టేషన్ తమ భూభాగంలో ఉందని, తమ ఊరి పేరే పెట్టాలని రైనా గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో రైల్వేశాఖ స్టేషన్ పేరును తొలగించింది. టికెట్‌లో రైనాగఢ్‌గా ఉంటోంది.
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 189/4 రన్స్ చేసింది. సఫారీ ప్లేయర్లలో తజ్‌మిన్ బ్రిట్స్ 81, మారిజానె కాప్ 57 రన్స్‌తో చెలరేగారు. కెప్టెన్ వాల్వార్డ్(33) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ, రాధ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌ను JIO CINEMAలో ఉచితంగా లైవ్ చూడొచ్చు.
అదానీ గ్రూప్‌పై రిపోర్టు రిలీజ్ చేసినందుకు సెబీ నోటీసులు పంపిందన్న హిండెన్‌బర్గ్ ప్రకటన కొత్త ట్విస్టులకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంలో హిండెన్‌బర్గ్‌తో కింగ్‌డాన్ క్యాపిటల్ ఫౌండర్‌కు సంబంధం ఉండగా ఆయన సతీమణి ఆన్లా ఛాంగ్ చైనా దేశస్థురాలు కావడం వివాదాస్పదమైంది. 20ఏళ్ల పాటు చైనాలో పనిచేసిన ఆమె 2016లో ‘సప్‌చైనా’ అనే మీడియా సంస్థ ప్రారంభించారు. చైనా ఏజెంట్ అనే ఆరోపణలు రావడంతో కొంతకాలానికి మూతపడింది.
Sorry, no posts matched your criteria.