India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయి, సిగరెట్లను క్యాంపస్‌లోకి తీసుకెళ్తూ సెక్యూరిటీకి పట్టుబడ్డారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
TG: విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కంపెనీలు ప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఎన్నారైలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ఐటీ కంపెనీలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీని విస్తరించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రైవేట్ పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించిందీ తెలియరాలేదు. జాబ్‌లు కోల్పోయిన వారు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా జనవరిలో గేమింగ్ డివిజన్‌లో మైక్రోసాఫ్ట్ 2వేల మందిని తొలగించింది. గతేడాదిలో సంస్థ ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27లక్షలకు తగ్గింది.
AP: గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే అతన్ని వెంటాడుతున్నాయని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు చేసిన అవినీతి మొత్తాన్ని వెలికి తీస్తామన్నారు. జగన్ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. ఐదేళ్లలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో నరమేధం సృష్టించారని దుయ్యబట్టారు.
పాకిస్థాన్ ప్రజలపై అక్కడి GOVT మరో భారం మోపింది. ప్యాకేజ్డ్ పాలపై 18% పన్ను విధించడంతో ధరలు 25% పెరిగాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర రూ.370కి చేరింది. ఇది అభివృద్ధి చెందిన AUS, ఫ్రాన్స్ దేశాల్లోని ధరల కంటే అధికం. ఈ నిర్ణయంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పాక్‌లో నిత్యవసరాలు, ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
TG: విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోం శాఖ చొరవ తీసుకోవాలని CM రేవంత్ అన్నారు. APలో విలీనమైన 5 గ్రామాలను TGలో కలపాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, జిల్లాకో నవోదయ స్కూల్, రాష్ట్ర రహదారులు నేషనల్ హైవేలుగా మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్‌కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం-అమరావతి, హైదరాబాద్ -అమరావతి హైవేల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావులతో పాటు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. హెలికాప్టర్‌లో జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారన్నారు. పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయినా.. మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టడం, దాడులు చేయడం సీసీ టీవీల్లో రికార్డయ్యాయని.. అయినా జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనడం దారుణమన్నారు.
1927: నవలా రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1906: తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1978: హీరో కళ్యాణ్ రామ్ జన్మదినం
1995: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు జన్మదినం
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.
Sorry, no posts matched your criteria.