news

News July 4, 2024

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹లక్షకు పెంపు?

image

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో వేతనజీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50వేలు ఉండగా ఆ మొత్తాన్ని ₹లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.

News July 4, 2024

7న TTDP నేతలతో చంద్రబాబు భేటీ

image

తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వస్తున్నారు. టీటీడీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News July 4, 2024

ఓటమిలో.. గెలుపులో టీమ్ఇండియాతో మోదీ

image

టీ20 WC-2024 ట్రోఫీని గెలుపొంది స్వదేశానికి తిరిగివచ్చిన భారత జట్టును ప్రధాని మోదీ కలుసుకొని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విశ్వవిజేతల కుటుంబాలను కలుసుకొని వారితో సందడిగా గడిపారు. ఈక్రమంలో CWC2023 ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు మోదీ టీమ్ఇండియాను కలిసి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపిన సన్నివేశాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓటమిలోనూ, గెలుపులోనూ మోదీ టీమ్‌కు తోడుగా ఉన్నారని ట్వీట్స్ చేస్తున్నారు.

News July 4, 2024

జులై 11న CA ఫలితాలు: ICAI

image

ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ICAI అధికారిక ప్రకటన చేసింది. మేలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను జులై 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నెంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 4, 2024

వాస్తవాధీన రేఖను చైనా గౌరవించాలి: జైశంకర్

image

వాస్తవాధీన రేఖ(LAC)ని చైనా గౌరవించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌కు స్పష్టం చేశారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్యల్ని త్వరగా పరిష్కరించడంపై తాము చర్చించినట్లు ట్విటర్‌లో తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని నిర్దేశిస్తాయని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

News July 4, 2024

కాసేపట్లో సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సీఎం చంపై సోరెన్ రాజీనామా చేయగా జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్‌ను గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. సాయంత్రం రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

News July 4, 2024

బాలికపై లైంగిక వేధింపులు.. YCP మాజీ ఎమ్మెల్యే అరెస్టు

image

AP: వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై సుధాకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందు ఆ వీడియో వైరల్ అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

News July 4, 2024

బుమ్రా కొడుకును ఆడించిన మోదీ

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ బుమ్రా తన కుటుంబంతో సహా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా బుమ్రా కొడుకు అంగద్‌ను మోదీ ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కూడా మోదీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News July 4, 2024

రికార్డుల దహనంపై ఆరా తీసిన పవన్

image

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దహనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. వాటి వివరాలు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారని అడిగిన పవన్.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పీసీబీ ఆఫీసుల్లో భద్రతకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడించాలని పవన్ పేర్కొన్నారు.

News July 4, 2024

రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

image

TG: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు(కేకే) రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిన్న AICC చీఫ్ ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు BRSలో ఉన్నారు.