India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రపంచ మార్కెట్లలో సానుకూలత ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు సైతం జోరు ప్రదర్శిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో ఫెడ్ రేట్లు తగ్గొచ్చనే ఊహాగానాల మధ్య అక్కడి మార్కెట్లు లాభాలు నమోదు చేయడంతో ఆ ప్రభావం మన మార్కెట్ల మీదా పడిందంటున్నారు. కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు నెలకొనడం కూడా ఈ జోరుకు కారణమని తెలిపారు. ఇదే జోరు కొనసాగితే నిఫ్టీ త్వరలోనే 25వేల మార్క్ చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఫుడ్ మాఫియా బరితెగిస్తోంది. కర్ణాటకలోని దుకాణాల్లో పానీపూరీ టేస్టు, నీటి రంగు కోసం బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో లాంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేల్చారు. తమిళనాడులోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. దీంతో ఆ 2 రాష్ట్రాల్లో పానీ పూరీ అమ్మకాలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రస్తుత సీఎం చంపై సోరెన్ తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ‘ఝార్ఖండ్ ముక్తి మోర్చా’ నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు తమ తదుపరి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని రాజకీయ వర్గాల సమాచారం.
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర కీలక అంశాలపై మోదీకి సీఎం వినతి పత్రాలు సమర్పించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చించినట్లు సమాచారం. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.
ప్రధాని మోదీ నీచ రాజకీయాలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను దేశం గమనిస్తోందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ‘పార్లమెంట్‌ను అబద్ధాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు. అద్భుత వాగ్ధాటి, దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన కలిగిన రాహుల్ గాంధీని అవమానించేందుకు ఆయన దిష్టి బొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో మీరు ఏమి సాధిస్తారు? ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారు’ అని Xలో ఫైరయ్యారు.
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ మీడియా తెలిపింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకున్న జట్టు హోటెల్‌లో సేదదీరుతోంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విక్టరీ పరేడ్ జరగనుంది.
ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తల్లి పూర్ణిమాశర్మ ఇన్‌స్టా పోస్టు వైరల్ అవుతోంది. రోహిత్, కోహ్లీ, తన మనుమరాలు ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘టీ20 క్రికెట్లో ఇద్దరు దిగ్గజాలు. భుజాలపై కూతురు. వెనకాలే దేశం, పక్కన సోదరుడు’ అని ఆ ఫొటోపై రాసి ఉంది. ఈరోజు టీ20 వరల్డ్ కప్ ఇండియాకు చేరడంతో రెండ్రోజుల క్రితం ఆమె చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
డొనాల్డ్ ట్రంప్‌తో గతవారం అట్లాంటాలో జరిగిన డిబేట్‌లో తాను దాదాపు నిద్రపోయానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ‘చర్చకు ముందు విదేశీ పర్యటనలు వద్దని మా సిబ్బంది చెప్పారు. అయినా వినకపోవడంతో ఆ ప్రభావం నాపై పడింది. బాగా అలసిపోవడంతో డిబేట్ సమయంలో వేదికపై దాదాపు నిద్రపోయాను. అయితే నేను కారణాలు వెతకాలని అనుకోవట్లేదు’ అని పేర్కొన్నారు. డిబేట్‌లో ట్రంప్ ఎదుట బైడెన్ తేలిపోయిన సంగతి తెలిసిందే.
క్రిమినల్ విచారణ, అరెస్టు నుంచి రాజ్యాంగం ఆర్టికల్ 361 ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు, విధుల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే, అరెస్టు చేసే అధికారం ఏ కోర్టుకూ లేదని ఆర్టికల్ 361లోని క్లాజ్(1),(2) చెబుతున్నాయి. 2006లో రామేశ్వర్ ప్రసాద్vs కేంద్రప్రభుత్వం కేసులో గవర్నర్ వేధింపుల ఆరోపణలపైనా సుప్రీంకోర్టు ఇమ్యూనిటీ ఇచ్చింది.
బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ <<13170816>>ఆరోపించిన<<>> ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల్లో భాగంగా పరిగణిస్తారా? గవర్నర్ పదవిని కోల్పోయే వరకు న్యాయం కోసం ఎదురుచూడాలా? నా లాంటి బాధితురాలికి కోర్టు ఉపశమనం కలిగిస్తుందా? లేదా? అనేది చెప్పాలి’ అని కోరారు.
Sorry, no posts matched your criteria.