news

News October 30, 2024

మందుబాబులకు వెరైటీ ఆఫర్.. ఎక్కడంటే!

image

AP: సాధారణంగా వైన్స్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. దీంతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకునేందుకు పలువురు యజమానులు ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌కు గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అంటూ మందుబాబుల్ని ఊరిస్తూ బోర్డులు పెడుతున్నారు. షాపులు ఎక్కువగా ఉండటం పోటీ పెరగడంతో వ్యాపారులకు ఆఫర్ మార్కెటింగ్ తప్పడం లేదు.

News October 30, 2024

చైనా అగ్ర కుబేరుడు.. అంబానీ, అదానీకంటే పేదోడు!

image

హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్‌ ఇమింగ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఆస్తి విలువ 49.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, అది భారత కుబేరులు అంబానీ, అదానీల కంటే తక్కువే కావడం గమనార్హం. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 102 బిలియన్ డాలర్లు కాగా అదానీ ఆస్తి 92.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

News October 30, 2024

ఉదయనిధి డ్రెస్ కోడ్‌పై హైకోర్టులో పిటిషన్

image

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అధికారిక కార్యక్రమాల్లో ఆయన పార్టీ చిహ్నాలను ప్రదర్శించే దుస్తులు ధరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇది రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దీనిపై విచారించిన కోర్టు స్పందన తెలియజేయాలని GOVTని ఆదేశించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి డ్రెస్ కోడ్‌ విషయంలో నిబంధనలు పరిశీలించాలని ఏజీని కోరింది.

News October 30, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్

image

TG: దళిత బంధు పేరుతో ప్రజలను జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. దళిత బంధు ఇస్తామని ప్రజల నుంచి రూ.లక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పటికైనా వాటిని ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని పలువురి పేర్లను పేర్కొంటూ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది.

News October 30, 2024

పేలిన ‘లోకల్’ బాంబు: చైనాకు రూ.లక్ష కోట్ల నష్టం!

image

భారత ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం చైనాకు భారీ షాకే ఇచ్చింది. ఈ దీపావళి సీజన్లో ఆ దేశం రూ.1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం నష్టపోతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారని చెప్పారు. భారత వ్యాపారం ఈ 5 రోజుల్లోనే రూ.4.25 లక్షల కోట్ల టర్నోవర్‌ను టచ్ చేయొచ్చని అంచనా వేశారు. ధంతేరాస్ రోజే రూ.60వేల కోట్ల టర్నోవర్ దాటొచ్చని వెల్లడించారు.

News October 30, 2024

ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని: మంత్రి కోమటిరెడ్డి

image

TG: తమ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తాము బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీసీ కులగణన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

News October 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి ESI నోటీసులు

image

AP: నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ జప్తు నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల ESI నిధులు దారి మళ్లించడంతో వర్సిటీ అకౌంట్ నుంచి సదరు మొత్తం రూ.28 లక్షలు తీసుకుంటామని జప్తు నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగులకు చెందిన ఈఎస్ఐ సొమ్మును ఔట్ సోర్సింగ్ సంస్థ వాడుకుందని ఈఎస్ఐ గతంలో డిమాండ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 24న జప్తు నోటీసులిచ్చింది.

News October 30, 2024

JIO SMART GOLD: రూ.10తోనే పెట్టుబడి పెట్టొచ్చు

image

జియో ఫైనాన్స్ డిజిటల్ గోల్డ్ సేవలను ఆరంభించింది. తమ యాప్‌లోని స్మార్ట్‌గోల్డ్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చని తెలిపింది. కనీస పెట్టుబడి రూ.10గా పేర్కొంది. ‘కస్టమర్లకు స్మార్ట్‌గోల్డ్ డిజిటల్, సేఫ్, సెక్యూర్ సేవలు అందిస్తుంది. నగదు, గోల్డ్ కాయిన్స్, నగల రూపంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. గోల్డ్‌ను ఇంటికే డెలివరీ చేస్తాం’ అని తెలిపింది. Paytm, PhonePe సైతం ఈ సర్వీసెస్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

News October 30, 2024

ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’

image

సాయి పల్లవి <<14456841>>గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో<<>> ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వేలకు పైగా పోస్టులతో బాయ్‌కాట్ సాయిపల్లవి అన్న హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తన తాజా సినిమా అమరన్ తెరకెక్కిన నేపథ్యంలో ఆమె ఢిల్లీలోని అమరవీరుల స్మారక స్తూపాన్ని సందర్శించారు. సినిమా ప్రమోషన్స్‌ కోసం వార్ మెమోరియల్ వాడుకున్నారంటూ ఆ చర్య కూడా వివాదాస్పదమైంది.

News October 30, 2024

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

image

ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.