India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ దేశంలో ఖలిస్థానీలను చంపేందుకు కుట్రలు పన్నింది అమిత్ షానే అని కెనడా తాజాగా ఆరోపించింది. కుట్రలు పన్నింది ఆయనేనా అని వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని జవాబిచ్చినట్టు కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిస్ పార్లమెంటరీ ప్యానెల్‌కు చెప్పారు. దీనిపై ఎలాంటి వివరాలు, ఆధారాలను మాత్రం ఆయన ఇవ్వలేదు. ఆయన స్టేట్‌మెంట్‌పై భారత హైకమిషన్, విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
TG: 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి దాదాపు 2 నెలలు కావొస్తుంది. నెలలు గడుస్తున్నా ఎంపికైన వారి జాబితా ఇవ్వట్లేదని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఇదే విషయమై టీజీపీఎస్సీ అధికారితో మాట్లాడినా ఇంకా ఎలాంటి ప్రకటన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తుది ఫలితాలు ప్రకటించాలని కోరుతున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. NBK109, గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్లు రానున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా NBK109 బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తోంది. ఈ రెండు చిత్రాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. సెన్సెక్స్ 80,027 (-341), నిఫ్టీ 24,367 (-99) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, మీడియా, IT షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. సిప్లా, Dr రెడ్డీస్, సన్ ఫార్మా, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.
ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన జట్టు మేనేజ్‌మెంట్‌కు సమాచారమిచ్చినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 2022 నుంచి ఆ జట్టుకు డు ప్లెసిస్ కెప్టెన్సీ చేస్తున్నారు. కెప్టెన్లు మారుతున్నా కప్పు కొట్టడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో మరోసారి తానే కెప్టెన్‌గా కప్పుకోసం ట్రై చేయాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు కలకలం రేపాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి సందేశం పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు భద్రతను పటిష్ఠం చేశారు.
AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ లాస్‌వేగాస్‌లో IT సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో ప్రసంగించారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల, అమెజాన్ వెబ్ సర్వీసెస్ MD రేచల్, పెప్సికో మాజీ CEO ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో లోకేశ్ సమావేశమయ్యారు. APలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.
త్వరలో విడుదల కానున్న సూర్య ‘కంగువా’ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్(43) అనుమానాస్పదంగా మృతిచెందారు. కొచ్చిలోని పనంపిల్లినగర్‌లో ఆయన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించారు. ఎలా చనిపోయారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ జావా, వన్, ఉడాల్, ఎగ్జిట్, సౌదీ వెల్లక్కా తదితర మలయాళం సినిమాలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తల్లుమాల సినిమాకు గాను కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు.
>>మహాయుతి కూటమి
*బీజేపీ- 148
*శివసేన (షిండే)- 80
*ఎన్సీపీ (అజిత్ పవార్)- 52
*ఇతరులు- 6
*ఒక సీట్లో పోటీ చేయట్లేదు. మరో సీట్ MNSకు ఇచ్చినట్లు సమాచారం.
>>మహా వికాస్ అఘాడీ
*కాంగ్రెస్- 101
*శివసేన (ఉద్ధవ్ థాక్రే)- 96
*ఎన్సీపీ (శరద్ పవార్)- 87
*ఎస్పీ- 2
*సీపీఎం- 2
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. ఇటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,140 మంది దర్శించుకోగా 16,937 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు లభించింది.
Sorry, no posts matched your criteria.