India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తప్పుదోవపట్టించేలా యాడ్స్ ప్రసారం చేయడంపై పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ మరోసారి క్షమాపణలు కోరుతూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఇటీవల పేపర్లో చిన్నగా క్షమాపణ ప్రకటన ఇవ్వడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు, యాడ్స్ సైజ్‌లోనే క్షమాపణలు ఉండాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా పతంజలి బేషరతు క్షమాపణలు కోరుతూ పెద్దగా మరోసారి పేపర్లలో ప్రకటన ప్రింట్ చేయించింది.
బెంగళూరులో ఇవాళ ‘జీరో షాడో డే’. మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు 6 నిమిషాల పాటు నీడ మాయం కానుంది. కాగా సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. సూర్యుడు +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
హీరోయిన్ అపర్ణ దాస్ పెళ్లిపీటలెక్కారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2019లో విడుదలైన ‘మనోహరం’ సినిమా అపర్ణకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో దీపక్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాజాగా పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో EC భద్రపరుస్తుంది. అయితే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటులో కొన్ని భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
➣స్ట్రాంగ్ రూమ్‌కు ఒకటే తలుపు ఉండాలి
➣ప్రవేశ ద్వారం మినహా వేరే మార్గంలో లోనికి వెళ్లేందుకు ఆస్కారం ఉండకూడదు.
➣అగ్ని ప్రమాదం సంభవించినా గోడలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు ఉంటాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
➢ డబుల్ లాక్ సిస్టమ్ కలిగి ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు సీఏపీఎఫ్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు.
➢సీఏపీఎఫ్ గార్డులు, పోలీసులు, జిల్లా కార్యనిర్వాహక గార్డులతో చెందిన దళాలతో మూడంచెల భద్రత ఉంటుంది
➢విద్యుత్ శాఖ సహకారంతో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చేస్తారు. జనరేటర్ సైతం అందుబాటులో ఉంచుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>
1952 ఎన్నికల్లో విశాఖ(D) పరవాడలో ఉన్న 60,780 ఓట్లలో 25,511 మాత్రమే పోలయ్యాయి. ఇందులో వీరభద్రం(CPI)కి అత్యధికంగా 7,064 ఓట్లు వచ్చాయి. అప్పటి రూల్ ప్రకారం డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో 3వ వంతు.. అంటే 8,504 ఓట్లు రావాలి. అయితే ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారే విజేత అన్న కమ్యూనిస్టుల వాదనతో వీరభద్రంను MLAగా EC ప్రకటించింది. ఆ తర్వాత డిపాజిట్ దక్కేందుకు 6వ వంతు ఓట్లు రావాలని రూల్ మార్చింది.
AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <
TG: ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్‌ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా dgacb@telangana.gov.inకి మెయిల్ చేయాలన్నారు.
మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్‌తోనే తాము మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘ఈ మ్యాచ్ బాగా సాగింది. 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉండటంతో మా స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకలేదు. అందుకే ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది. మేము మరో 20 పరుగులు చేయాల్సింది. లక్నో టీమ్ గొప్పగా ఆడింది’ అని రుతురాజ్ తెలిపారు.
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు నాంపల్లిలో విద్యాశాఖ కార్యదర్శి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్‌లో మీ ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా ఒక్క క్లిక్‌తో దీన్ని షేర్ చేయొచ్చు.
#Be Ready
Sorry, no posts matched your criteria.