news

News April 24, 2024

రికార్డు సృష్టించిన బౌల్ట్

image

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించారు. IPLలో మొదటి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు(26*) తీసిన బౌలర్‌గా నిలిచారు. తొలి ఓవర్‌లో 5వ బంతికి రోహిత్‌ను ఔట్ చేసి బౌల్ట్ ఈ ఫీట్ సాధించారు. దీంతో భువనేశ్వర్‌కుమార్ పేరిట ఉన్న రికార్డు(25వికెట్లు) చెరిగిపోయింది. ఇదిలా ఉంటే T20ల్లో హిట్‌మ్యాన్‌ను బౌల్ట్ 6సార్లు ఔట్ చేశారు.

News April 24, 2024

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తులు ఎంతంటే?

image

TG: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట దాదాపు రూ.1250 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య సంగీతా రెడ్డి పేరిట రూ.3,203 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలిపారు. తనకు సొంత కారు కూడా లేదని పేర్కొన్నారు. తనపై నాలుగు క్రిమినల్ ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 24, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. యూజర్లు తమ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, గ్రూపులను ఫేవరెట్స్ జాబితాకు యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆయా కాంటాక్ట్‌ని ఈజీగా కనుగొని స్పీడ్ డయల్‌తో పాటు ఈజీగా మెసేజ్‌లు పంపేందుకు వీలుంటుంది. సెట్టింగ్స్ మెనూలో ఈ ఫేవరెట్ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో కాంటాక్ట్స్ ఆర్డర్‌ను మార్చుకోవడంతో పాటు తొలగించవచ్చు.

News April 24, 2024

ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది: ఫించ్

image

వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఎంపిక వెనుక ఐపీఎల్‌ ప్రామాణికత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య, జైస్వాల్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అన్నారు. ‘వారిద్దరూ ఈ ఐపీఎల్‌లో సరైన ప్రదర్శన చేయలేదు. టోర్నీ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇద్దరిపైనా తీవ్ర ఒత్తిడి ఉంది. వీలైనంత త్వరగా తమ మార్కును చూపించాలని వారు భావిస్తుంటారు’ అని ఫించ్ పేర్కొన్నారు.

News April 24, 2024

డీజీపీని తప్పించాలని టీడీపీ ఫిర్యాదు

image

AP: DGP రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు TDP ఫిర్యాదు చేసింది. ‘సీనియర్లను పక్కనపెట్టి ఆయనకు ఇన్‌ఛార్జ్ DGP బాధ్యతలు అప్పగించారు. DGPని వెంటనే బదిలీ చేయాలి. జగన్ ప్రచార బస్సు డోర్ వద్ద ఉండాలని SPలకు చెప్పడం ఏంటి? కడప, పులివెందులలో ఎన్నికలు సజావుగా జరగాలి. ఈ డీజీపీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారా?’ అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

News April 24, 2024

2వ దశ పోలింగ్‌పై ఎండల తీవ్రత ఉండదు: IMD

image

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రెండో దశ ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ రాజీవ్ కుమార్ శర్మ, ఎలక్షన్ కమిషనర్లు వాతావరణశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాగా.. రెండో దశ పోలింగ్‌‌పై ఎండల తీవ్రత పెద్దగా ఉండబోదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణశాఖ అధికారులు ECకి తెలిపారు.

News April 24, 2024

కేక్ తిని బాలిక మృతి.. దర్యాప్తులో ఏం తేలిందంటే?

image

పంజాబ్‌లో మాన్వి అనే బాలిక బర్త్‌డే రోజు కేక్ తిని <<12955452>>మృతి<<>> చెందిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడయ్యాయి. కేక్‌లో ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్ ‘సాచరైన్‌’ను అధిక మోతాదులో వాడినట్లు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా ఆహారం, పానీయాలలో దీనిని తక్కువ మొత్తంలో వాడతారు. కేక్‌లో ఎక్కువగా వాడటంతో తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. కేక్ తయారు చేసిన బేకరీపై పోలీసులు FIR నమోదు చేశారు.

News April 24, 2024

CAA నిబంధనలు భారత రాజ్యాంగ విరుద్ధం: సీఆర్ఎస్

image

CAAలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా చట్టసభ పరిశోధన విభాగం సీఆర్ఎస్ ఓ నివేదికలో పేర్కొంది. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన ఆ దేశాల మైనారిటీలకు సీఏఏ ద్వారా భారత్ పౌరసత్వం అందిస్తుంది. అయితే ముస్లింలను మినహాయించడం రాజ్యాంగానికి సమ్మతం కాదని సీఆర్ఎస్ పేర్కొంది. రాజకీయ కారణాలతోనే ఈ చట్టాన్ని సర్కారు తీసుకొచ్చిందని అభిప్రాయపడింది.

News April 24, 2024

మల్కాజ్‌గిరిని నేనెప్పుడూ మర్చిపోను: రేవంత్

image

TG: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని తానెప్పుడూ మర్చిపోనని CM రేవంత్ తెలిపారు. శామీర్‌పేట సభలో మాట్లాడిన ఆయన.. ‘కొడంగల్‌లో ఓడితే.. మల్కాజ్‌గిరిలో MPగా గెలిపించారు. MPగా చేసిన పోరాటంతోనే PCC చీఫ్ పదవి వచ్చింది. పడిపోతున్న నన్ను ఇక్కడి ప్రజలే నిలబెట్టారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి.. నాకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సునీతా మహేందర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి’ అని కోరారు.

News April 24, 2024

కేజ్రీవాల్‌కు వ్యక్తిగత వైద్యులు అనవసరం: కోర్టు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు వ్యక్తిగత వైద్యులు అవసరం లేదని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. వైద్యపరీక్షల కోసం ఎయిమ్స్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించాలని సూచించింది.