news

News April 24, 2024

వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్

image

AP: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

News April 24, 2024

25న తెలంగాణకు అమిత్ షా

image

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ప్రచారం నిర్వహించనున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలో షా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

News April 24, 2024

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

image

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఈ నెల 18న కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి శోభాయాత్రంలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద ప్రసంగంలో సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

News April 24, 2024

టెన్త్ ఫలితాలు: ఈ స్కూళ్లలో అందరూ ఫెయిల్

image

AP: రాష్ట్రంలో 2,803 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని(0%) చెప్పారు. ఈ 17 స్కూళ్లలో ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇక 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా తొలి, 62.47%తో కర్నూలు జిల్లా చివరిస్థానాల్లో నిలిచాయి.

News April 24, 2024

సా.6 గంట‌ల‌కు ‘తలైవా 171’ టైటిల్, టీజ‌ర్‌

image

రజినీకాంత్‌-లోకేశ్ కనగరాజ్ కాంబోలో ‘తలైవా 171’ మూవీ రానుంది. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇవాళ బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారు. టైటిల్, టీజ‌ర్‌‌ను సా.6 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘తలైవా 171’లో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు చోరీ చేసే దొంగలా కనిపించునున్న‌ట్లు సమాచారం.

News April 24, 2024

తెలుగు మీడియంలో 71%, ఇంగ్లిషు మీడియంలో 92% ఉత్తీర్ణత

image

AP: టెన్త్ ఫలితాల్లో 5లక్షల 34వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 86.69 శాతం మంది పాసయ్యారు. కాగా వీరిలో ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసిన వారితో పోలిస్తే తెలుగు మీడియంలో పాస్ పర్సంటేజ్ తగ్గింది. తెలుగు మీడియంలో 71.08% ఉత్తీర్ణత నమోదవ్వగా.. ఇంగ్లిష్ మీడియంలో 92.32% ఉత్తీర్ణత నమోదైంది.

News April 24, 2024

పది ఫలితాలు.. బాలికలదే పైచేయి

image

AP: పదో తరగతి ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. బాలికలు 89.17%, బాలురు 84.32% మంది పాసైనట్లు చెప్పారు. సబ్జెక్టులవారీగా ఫస్ట్ లాంగ్వేజ్‌లో 96.47%, సెకండ్ లాంగ్వేజ్ 99.24%, థర్డ్ లాంగ్వేజ్ 98.52%, మ్యాథ్స్ 93.33%, జనరల్ సైన్స్ 91.296%, సోషల్ స్టడీస్‌లో 95.34శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
* WAY2NEWSలో రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

News April 24, 2024

BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

image

AP పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది మొత్తం 6 లక్షల మందికి పైగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. 6,16,615 మంది పరీక్షలు రాస్తే 86.69% ఉత్తీర్ణత నమోదైందని సురేశ్ తెలిపారు. అంటే 5,34,574 మంది పాసయ్యారు. WAY2NEWSలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, ఫలితాలు చెక్ చేసుకోండి.

News April 24, 2024

ఖమ్మం సీటుపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు

image

TG: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. క్యాండిడేట్‌ గురించి చర్చించేందుకు జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి బెంగళూరు వెళ్లారు. AICC అధ్యక్షుడు ఖర్గేతో వేర్వేరుగా భేటీ అవ్వనున్నారు. తమ అభిప్రాయాన్ని ఆయనకు వివరించనున్నారు. మరోవైపు ఇప్పటికే రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరావు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది.

News April 22, 2024

ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులు!

image

1998 ఎన్నికల్లో 182 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఏడాదిన్నరలోపే ఆ లోక్‌సభ రద్దైంది. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో బలపరీక్ష అనివార్యమైంది. BSP మద్దతు ఇస్తామని.. ఓటింగ్ సమయంలో ఎదురు తిరగడంతో ఒక్క ఓటుతో వాజ్‌పేయి సర్కార్ తలకిందులైంది. అయితే 1999 ఎన్నికల్లో NDA సంపూర్ణ మెజార్టీ సాధించింది.<<-se>>#ELECTIONS2024<<>>