India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు 1902 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని వీరు 1902కు కాల్ చేశారు.
ఈ ఏడాదీ RCBకి అదృష్టం కలిసి రాలేదు. 8 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఏదైనా జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. RCB మిగిలిన 6 మ్యాచ్‌లను భారీ మార్జిన్‌లతో గెలిచినా 14 పాయింట్లే ఉంటాయి. దీనిప్రకారం ఆ జట్టు సొంతంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. మిగతా టీమ్‌లపై ఆధారపడాల్సిందే. అవి భారీ తేడాలతో ఓడిపోవడం లేదా మ్యాచ్‌లు రద్దవడం జరగాలి.
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) ఘన విజయం సాధించింది. మొత్తం 93 సీట్లు ఉండగా, 88 స్థానాల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 66 సీట్లను ముయిజ్జు పార్టీ కైవసం చేసుకుని, స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాగా, ముయిజ్జు చైనాకు విధేయుడిగా ఉన్నారు.
ఏపీ డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 9వ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 21న హాల్ టికెట్లు, 24న పరీక్ష, మే 30న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 6వ తేదీ నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు, 12 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
TG: తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్‌పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.
AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల ATMలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలను దుండుగులు దోచుకెళ్లారు. ఇంటి దొంగలే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఆ నగదును మర్రి చెట్టు తొర్రలో దాచినట్లు వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అక్కడికెళ్లి ఆ మొత్తాన్ని సీజ్ చేశారు.
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ బియ్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. కాగా, బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ నిషేధం విధించడంతో పాక్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
AP: టెన్త్ ఫలితాలను ఇవాళ ఉ.11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
<<-se>>#ResultsFirstOnWay2News<<>>
వంశీ డైరెక్షన్‌లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. 2 నెలల్లోనే 100 మిలియన్ల వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. స్టువర్టుపురం గజ దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గత ఏడాది అక్టోబర్‌లో రిలీజవగా, మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణూ దేశాయ్ కీలక పాత్రల్లో నటించారు.
IPL హిస్టరీలో KKR తొలిసారి ఒక రన్ తేడాతో RCBపై గెలిచింది. గతంలో RCB(2014), PBKS(2020)పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్‌గా RCB, MI చెరో 3 సార్లు, పంజాబ్ రెండు సార్లు, CSK, LSG, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కోసారి ఒక రన్ తేడాతో గెలిచాయి.
Sorry, no posts matched your criteria.