news

News April 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 22, 2024

విరాట్ కోహ్లీది ఔటా? నాటౌటా?

image

కేకేఆర్‌తో మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారుతోంది. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్ టాస్ బంతిని విరాట్ డిఫెన్స్ ఆడటంతో బంతి గాల్లోకి లేచి రిటర్న్ క్యాచ్ అందుకున్నారు. బాల్ నడుము కంటే పైకి వచ్చిందని కోహ్లీ రివ్యూ తీసుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఇది కొందరు ఔట్ అని.. మరికొందరు నాటౌట్ అని వాదిస్తున్నారు. మరి ఇది ఔటా.. నాటౌటా కామెంట్ చేయండి.

News April 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 22, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:40
సూర్యోదయం: ఉదయం గం.5:55
జొహర్: మధ్యాహ్నం గం.12:15
అసర్: సాయంత్రం గం.4:42
మఘ్రిబ్: రాత్రి గం.6:34
ఇష: రాత్రి గం.07.49
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 22, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 22, సోమవారం
శు.చతుర్దశి: తెల్లవారుజాము 3:26 గంటలకు
హస్త: రా.7:59 గంటలకు
దుర్ముహూర్తం: మ.12:30 నుంచి 1.20 వరకు
దుర్ముహూర్తం: మ.3 నుంచి 3.50 వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 2:32 నుంచి 4:19 వరకు

News April 22, 2024

TODAY HEADLINES

image

AP: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు
AP: 9 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
AP: జగన్‌లా నాపై 32 కేసులు లేవు: పవన్ కళ్యాణ్
AP: బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల
TS: నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్
TS: వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు: కిషన్ రెడ్డి
TS: ఈనెల 24న ఇంటర్ ఫలితాలు
TS: త్వరలో 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: ఉత్తమ్
IPL: RCBపై KKR, PBKSపై GT విజయం

News April 22, 2024

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన ఆర్పీబీ తరఫున 250 సిక్సర్లు కొట్టారు. తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (RCB) 239, ఏబీ డివిలియర్స్ (RCB) 238, రోహిత్ శర్మ (MI) 224, కీరన్ పొలార్డ్ (MI) 223 ఉన్నారు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా క్రిస్ గేల్ 357 సిక్సర్లు బాదారు.

News April 21, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేరుగా PhD చేయొచ్చు!

image

UGC NET జూన్ సెషన్ పరీక్షలో కొత్త విధానం అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 75% మార్కులు/సమానమైన గ్రేడ్‌లు సాధించిన వారు నేరుగా UGC NET రాయవచ్చని సంస్థ ఛైర్మన్ జగదీశ్ వెల్లడించారు. ఆ అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా PhD అభ్యసించొచ్చని తెలిపారు. కాగా ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశముండేది.

News April 21, 2024

IPL: పంజాబ్‌పై గుజరాత్ విజయం

image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో తెవాటియా 36*, గిల్ 35, సుదర్శన్ 31 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో పంజాబ్‌కి ఇది ఆరో ఓటమి కాగా, గుజరాత్‌కు నాలుగో విజయం.

News April 21, 2024

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి: సిరాజ్

image

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగించాలని ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి. బౌలర్లకు చాలా ఇబ్బందిగా మారుతోంది. బ్యాటర్లు రాగానే విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో 270-280 రన్స్ పరిపాటిగా మారింది’ అని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 260కు పైగా స్కోర్లు 4సార్లు నమోదుకావడం విశేషం.