news

News April 21, 2024

చేతులు కలిపిన వసంత, దేవినేని

image

AP: మైలవరం నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులు మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. తన తరఫున ప్రచారం చేయాలని ఉమాను వసంత కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా పనిచేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. రేపు వసంత నామినేషన్ కార్యక్రమంలో దేవినేని పాల్గొననున్నారు.

News April 21, 2024

25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: ఉత్తమ్

image

TG: ఎంపీ ఎన్నికల తర్వాత BRSలో ఎవరూ మిగలరని హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల్లో BRS, BJP అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవు. ఆ తర్వాత 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు. కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే దేశానికే ప్రమాదం. అందుకే జూన్ 9న రాహుల్ ప్రధాని కాబోతున్నారు’ అని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

News April 21, 2024

జగన్ రెడ్డి ఓ మూర్ఖుడు: పవన్

image

AP: ప్రతీ రోజు ముగ్గురు భార్యలు అంటూ హేళన చేస్తున్న సీఎం జగన్ ఓ మూర్ఖుడు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఎప్పుడు చూసినా జగన్ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. మాట్లాడితే ముగ్గురు పెళ్లాలు అంటారు. అందరి ఇళ్లలో విభేదాలు ఉంటాయి. నా ఇంట్లో కూడా అలానే విభేదాలు ఉన్నాయి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటీ? నా వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాట తీస్తా’ అని ఆయన మండిపడ్డారు.

News April 21, 2024

రేపు, ఎల్లుండి జాగ్రత్త!

image

AP: రేపు 26 <>మండలాల్లో<<>> తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 88 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవాళ అత్యధికంగా నంద్యాల(D) చాగలమర్రిలో 45.5°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయని తెలిపింది.

News April 21, 2024

ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతాం: CM

image

TG: ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.

News April 21, 2024

ఇండియన్ సినిమాకు 111 ఏళ్లు

image

భారతీయ తొలి సినిమా ‘రాజాహరిశ్చంద్ర’ సరిగ్గా ఇదే రోజు 1913లో విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే తెరకెక్కించిన ఈ మూవీని తొలుత ముంబైలో ప్రదర్శించారు. రామాయణ మహాభారతాల్లో పేర్కొన్న రాజు హరిశ్చంద్రుడి గురించి ఇందులో చూపించారు. ఈ మూవీ కంటే ముందు ‘పుండలీక్’ 1912లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లంతా విదేశీయులు కావడంతో ‘రాజాహరిశ్చంద్ర’ భారత తొలి సినిమాగా పరిగణితమవుతోంది.

News April 21, 2024

IPL: గుజరాత్ టార్గెట్ 143 రన్స్

image

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 142 స్కోరుకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ 35, హర్‌ప్రీత్ బ్రార్ 29, సామ్ కరన్ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. GT బౌలర్లలో సాయి కిశోర్ 4, మోహిత్‌ శర్మ 2, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

News April 21, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: రాష్ట్రానికి సంబంధించిన 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శ్రీకాకుళం-పెడద పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం(SC)- జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్, ఒంగోల్-ఈదా సుధాకర్ రెడ్డి, నంద్యాల-జేఎల్ నరసింహ యాదవ్, అనంతపురం-వజ్జల మల్లికార్జున, హిందూపురం-సమద్ షాహీన్‌ల పేర్లతో జాబితా విడుదల చేసింది.

News April 21, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

image

మసూద, జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కల్పనా రావుతో ఆయన వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త జర్నీని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లి ఫొటోలను షేర్ చేశారు.

News April 21, 2024

నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్

image

TG: తనతోపాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కోమటిరెడ్డి పోరాట యోధుడు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే.. కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా బీజేపీలో కలిపేస్తారు. ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడూ పోరాడలేదు’ అని ఆయన మండిపడ్డారు.