India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీ ఫామ్ అందుకున్న ప్రతీ అభ్యర్థి గెలిచి రావాలి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కొత్త అభ్యర్థులు పార్టీ నిబంధనలు పాటించాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే నా ఆశయం. ప్రజాగళానికి వస్తున్న ఆదరణ చూసి జగన్ వణికిపోతున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేకే జగన్ డ్రామాలాడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
ఐఏఎస్‌ల జీతంపై ఓ చార్టెడ్ అకౌంటెంట్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీతం తక్కువని తెలిసినా ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు? అని చిరాగ్ చౌహాన్ అనే సీఏ ట్వీట్ చేశారు. IAS అధికారుల సగటు జీతం CA ఉద్యోగులకు వచ్చే ఆరంభ వేతనంతో సమానం అని తెలిపారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘గౌరవం, ప్రజా సేవ కోసం ఐఏఎస్ అవుతారు. డబ్బు కోసం కాదు’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా పూజా ‘రంగస్థలం’ సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఐపీఎల్-2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆర్సీబీ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక ఎడిషన్‌లో పవర్ ప్లేలో ఎక్కువసార్లు 70+ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 4 సార్లు ఆ జట్టు బౌలర్లు PPలో 70కి పైగా రన్స్ ఇచ్చారు. కేకేఆర్(85/0, 75/1), ముంబై (72/0), SRH (76/0)తో జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ 400 సీట్లు గెలుచుకుందని.. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఏర్పడింది. ఆ కూటమిలోని పార్టీలే ఒకదానిపై మరొకటి పోటీ పడుతున్నాయి. అడ్డదారిన రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారింది. సోనియా, మన్మోహన్, కేసీ వేణుగోపాల్‌లు ఇదే దారిలో రాజ్యసభకు వచ్చారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
AP: కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘చిరంజీవే కాదు, ఎంతమంది కలిసొచ్చినా కూటమికి ఒరిగేదేమీ లేదు. ఏపీలో గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయి. అవి ఒకవైపు, జగన్ ఒక్కడే ఒకవైపు. జనం ఆయనతోనే ఉన్నారు. జగన్ ఈనెల 25న నామినేషన్ వేస్తారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం’ అని స్పష్టం చేశారు.
భారత్‌లోని ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ‘స్టాక్‌గ్రో’ తమ ఉద్యోగుల కోసం వినూత్న పాలసీని తీసుకొచ్చింది. రిలేషన్‌షిప్ బ్రేకప్స్, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వారికి సెలవు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎలాంటి ప్రశ్నలు అడగబోమని, ఆధారాలు చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. వీరు అవసరాన్ని బట్టి సెలవును పొడిగించుకోవచ్చని చెప్పింది. కాగా స్టాక్‌గ్రోకు 30 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.
ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లపై సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనా పరోక్ష విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ టైమ్‌లో పార్టీలు చేసుకుంటున్న జట్లు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీని కూడా గెలవలేదన్నారు. ‘చెన్నై ఎప్పుడూ పార్టీ చేసుకోలేదు. ఐపీఎల్‌లో 5 కప్పులు, 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు గెలిచింది. ముంబై కూడా 5 కప్పులు గెలిచింది. రాత్రంతా పార్టీ చేసుకునే ఆటగాళ్లు తర్వాతి రోజు ఆట ఎలా ఆడగలుగుతారు?’ అని ప్రశ్నించారు.
IAS అధికారి కావాలనేది యువత కల. కానీ ఆ ఛాన్స్ కొంతమందికే దక్కుతుంది. జీతం తక్కువైనా IAS కావాలనుకోవడానికి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం గౌరవ మర్యాదలు, అధికారం అందిస్తుంది. ఆ అధికారంతో ప్రజలకు, సమాజానికి ఎలాంటి ప్రయోజనమైనా కల్పించవచ్చు. ఉద్యోగ భద్రతకు తిరుగుండదు. వారిని తొలగించడం కష్టం. వేతనంతోపాటు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆఫీస్, బంగ్లా, వాహనం, పీఏ, డ్రైవర్ వంటి అత్యుత్తమ సౌకర్యాలు ఉంటాయి.
భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీకి అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ నెట్’కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ తెలిపింది. ఈ ఏడాది జూన్ 16న దేశవ్యాప్తంగా పరీక్షను నిర్వహించనున్నారు. వచ్చే నెల 10న రాత్రి 11.50గంటలకు దరఖాస్తుల గడువు ముగియనుంది. అప్లికేషన్లలో పొరపాట్లుంటే వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ మధ్యలో సరిచేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.