news

News April 20, 2024

ఏలూరును ఏలేదెవరో!

image

రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే స్థానాల్లో ఏలూరు ఒకటి. దేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరు ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ నుంచి 1989లో గెలిచారు. తొలినాళ్లలో ఏలూరు కమ్యూనిస్టుల కోటగా ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ 8సార్లు, TDP 5సార్లు, YCP ఒకసారి నెగ్గాయి. ఈసారి సునీల్ యాదవ్(YCP), పుట్టా మహేశ్ యాదవ్(TDP) ఈ ప్రాంతంపై పట్టు కోసం యత్నిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 20, 2024

కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లేఖ

image

AP: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో బొండా ఉమను ఇరికించేలా కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.

News April 20, 2024

హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

image

దుకాణాలు తాము అమ్మిన వస్తువుల ప్యాకింగ్‌కు లేదా క్యారీ బ్యాగ్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకూడదు. కానీ HYDలోని ఐకియా క్యారీ బ్యాగ్‌కు ఓ కస్టమర్‌ నుంచి రూ.20 వసూలు చేసింది. అతడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఐకియాకు రూ.1000 ఫైన్ పడింది. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు 45 రోజుల్లోపు చెల్లించకపోతే రూ.5వేలు ప్లస్ ఏడాదికి 24% వడ్డీ లెక్కన ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

News April 20, 2024

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వృద్ధులకు గుడ్‌న్యూస్

image

హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని, ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు IRDAI తెలిపింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, మారటోరియాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.

News April 20, 2024

మహిళా సాధికారత కోసమే సూపర్-6: బ్రాహ్మణి

image

AP: మహిళా సాధికారత కోసమే సూపర్-6 పథకాలు తీసుకువస్తున్నట్లు నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం తపిస్తుంటారు. వయసు పెరుగుతున్నా చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. లోకేశ్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.

News April 20, 2024

కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: ఎంపీ లక్ష్మణ్

image

TG: వికసిత్ భారత్ తరహాలోనే వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, BRSకు భవిష్యత్తు లేదన్నారు. సీఎం రేవంత్ పాలన ఓటమికి దారులు వెతుక్కుంటున్నట్లు ఉందన్నారు.

News April 20, 2024

జగన్ వద్ద ₹82 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల

image

AP: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా ప్రకటించారు. అందులో చరాస్తులు రూ.123.26 కోట్లు, స్థిరాస్తులు రూ.9.29 కోట్లుగా ఉన్నాయి. షర్మిల వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నాయి. ఇక అన్న జగన్ వద్ద రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతిరెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. షర్మిలపై 8 కేసులు ఉన్నాయి.

News April 20, 2024

టార్గెట్ 300! ఇవాళ కొట్టేస్తారా?

image

ఈ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు రెచ్చిపోయి ఆడుతోంది. ఆ టీమ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 11ఏళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు (263) రికార్డును ముంబైతో మ్యాచ్‌లో 277 రన్స్‌తో SRH చెరిపివేసింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన రికార్డును తానే బద్దలు కొడుతూ 287 రన్స్ చేసింది. ఇక ఆ టీమ్ తర్వాతి టార్గెట్ 300 రన్స్ కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో ఆ ఘనత సాధిస్తారేమో చూడాలి.

News April 20, 2024

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: షబ్బీర్

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20మంది తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ చెప్పింది అబద్ధం. వాళ్ల ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మధ్యలో డ్రాప్ అవుతారు. అందుకే ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుంది. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన హెచ్చరించారు.

News April 20, 2024

అందుకే ధోనీ లేటుగా వస్తున్నారు: ఫ్లెమింగ్

image

CSK ఆటగాడు ధోనీ ఆఖరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చారు. ‘గత ఏడాది ధోనీ మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించిన నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. తనను చూసేందుకే స్టేడియానికి వచ్చే ఫ్యాన్స్‌ను నిరాశపరచకూడదనే చివర్లోనైనా బ్యాటింగ్‌కి వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఆయనకు లభించే ప్రేమ అద్భుతం’ అని వ్యాఖ్యానించారు.