news

News October 29, 2024

ఈ లిస్ట్‌లో మీ మండలం ఉందా?

image

AP: ఖరీఫ్ సీజన్‌లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?

News October 29, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, దీపావళి భద్రతా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించేందుకు హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని 185 ఫైర్ స్టేషన్ల సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటారు. బాణసంచా అక్రమ తయారీపై 100 లేదా 101కు ఫోన్ చేసి పోలీస్, అగ్నిమాపకశాఖలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

News October 29, 2024

అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ANR జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్, నాగచైతన్యతో కలిసి తాను, రామ్‌చరణ్ దిగిన ఫొటోను చిరు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అని క్యాప్షన్ ఇచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో బ్లాక్ సూట్‌లో స్టార్‌లు మెరిసిపోతున్న ఈ ఫొటో వైరలవుతోంది.

News October 29, 2024

షమీకి గుజరాత్ టైటాన్స్ ఝలక్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పేసర్ మహ్మద్ షమీని వదిలేయాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా ఆయన ఆటకు దూరం కావడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్‌, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌‌‌లను అట్టి పెట్టుకుంటుందని టాక్.

News October 29, 2024

వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదేనా..?

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ తర్వాత మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా టైటిల్‌ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ‘ఇక్కడ ఇల్లాలు అక్కడ ప్రియురాలు’, ‘ఇంట్లో ఇల్లాలు-పోలీస్ స్టేషన్లో ప్రియురాలు’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

News October 29, 2024

గేమ్‌ఛేంజర్ హిందీ రైట్స్ ఎవరికంటే..

image

పాన్ ఇండియా మూవీగా రానున్న రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ హిందీ హక్కుల్ని అనిల్ తడానీకి చెందిన AA Films దక్కించుకుంది. మూవీ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ హక్కుల్ని కూడా కొనుగోలు చేయడం గమనార్హం. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

News October 29, 2024

విజయమ్మ లేఖపై స్పందించిన షర్మిల

image

విజయమ్మ రాసిన లేఖపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ‘రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన’ అంటూ తల్లి లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

News October 29, 2024

ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP

image

AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన <<14483748>>లేఖలో<<>> స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.

News October 29, 2024

వాషింగ్టన్ సుందర్‌ కోసం మూడు జట్ల పోటీ

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్‌కి IPLలో డిమాండ్ అమాంతం పెరిగింది. సన్‌రైజర్స్ అతడిని రిటెయిన్ చేసుకోవట్లేదన్న సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో సీఎస్కే, ముంబై, గుజరాత్ జట్లు అతడిని వేలంలో దక్కించుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. మరి SRH సుందర్‌ని వేలంలో తిరిగి దక్కించుకుంటుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.