news

News April 19, 2024

వీళ్ల ఆస్తులు రూ.వందల్లోనే!

image

సాధారణంగా ఎంపీ అభ్యర్థి ఆస్తి రూ.లక్షలు లేక రూ.కోట్లలోనో ఉంటుంది. కానీ నేడు జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల అభ్యర్థుల్లో కొందరి ఆస్తి రూ.వందల్లో ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి నుంచి పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పోన్‌రాజ్ ఆస్తి రూ.320. చెన్నై నార్త్ స్వతంత్ర అభ్యర్థి సూర్యముత్తు, మహారాష్ట్రలోని రామ్‌తేక్ స్వతంత్ర అభ్యర్థి కార్తిక్ గెండ్లాజీ ఆస్తుల విలువ చెరో రూ.500గా ఉంది. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

LS PHASE-1: కోటీశ్వరులదే హవా

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. DMK, AIADMK నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

ఆ రాష్ట్రాలకు నేడు డబుల్ ధమాకా!

image

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలతో పాటు నేడు అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల BJP అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 50 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, 146 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News April 19, 2024

ఆ రాష్ట్రాల్లో అన్నీ స్థానాలకు నేడే పోలింగ్

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నీ స్థానాలకు నేడే పోలింగ్ జరగనుంది. తమిళనాడు (39), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయా (2) సహా చెరొక స్థానాలు ఉన్న సిక్కిం, నాగాలాండ్, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక యూటీలైన అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరీల భవితవ్యాన్ని కూడా ఓటర్లు నేడు తేల్చనున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

రేవంత్ ఎవరి కోసం పనిచేస్తున్నారు?: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డి CM అయ్యాక రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కనబడుతోందని KTR అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ‘లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం అన్యాయమని రాహుల్ అంటాడు. రేవంత్ మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్ట్ అంటాడు. రేవంత్ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోదీ కోసమా? రాహుల్ కోసమా?. మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది BJPకే వెళ్తుంది’ అని వ్యాఖ్యానించారు.

News April 19, 2024

నేడే లోక్‌సభ తొలి విడత ఎన్నికలు

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. తమిళనాడు, రాజస్థాన్, UP, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌లలో పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలోనూ ఎన్నికలు జరగనున్నాయి.

News April 19, 2024

ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

image

1912: నోబెల్ గ్రహీత, అమెరికా రసాయన శాస్త్రవేత్త గ్లెన్ సీబోర్గ్ జననం
1957: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జననం
1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ మరణం
2006: స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న మరణం
1971: మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రారంభం
1975: భారత్ తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ భూభాగం (ఇప్పటి రష్యా) నుంచి ప్రయోగించారు

News April 19, 2024

పిల్లల నిద్ర నాణ్యతకు భంగం కలిగించే అంశాలివే

image

నిద్రపోయే ముందు TVలు, ఫోన్‌లు చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం పిల్లల నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అసౌకర్యమైన పరిస్థితులు, డే టైమ్‌లో నిద్రపోవడం, నైట్ టెర్రర్స్/స్లీప్‌వాకింగ్ వంటివి కూడా ఇందుకు కారణమని అంటున్నారు. నిద్రతో పాటు చాలా విషయాల్లో పిల్లలు తమ పేరెంట్స్‌ని ఫాలో అవుతారని, కాబట్టి అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు నడుచుకోవాలని సూచిస్తున్నారు.

News April 19, 2024

హార్దిక్ మళ్లీ అట్టర్ ఫ్లాప్

image

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వరుసగా విఫలమవుతున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా కేవలం 10 రన్స్‌కే వెనుదిరిగారు. టోర్నీలో ఇప్పటివరకు పాండ్య 7 మ్యాచ్‌లు ఆడి 141 పరుగులు మాత్రమే చేశారు. అటు బౌలింగ్‌ కూడా అడపాదడపా వేస్తున్నా వికెట్లు దక్కించుకోవడం లేదు. కాగా కెప్టెన్సీ ఒత్తిడితోనే పాండ్య బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News April 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.