news

News April 19, 2024

TODAY HEADLINES

image

* సీఎం జగన్ హత్యకు కుట్ర: రిమాండ్ రిపోర్టులో పోలీసులు
* సీఎం జగన్‌పై దాడి కేసులో తొలి అరెస్ట్.. నిందితునికి రిమాండ్
* ఏపీలో 44,163 మంది వాలంటీర్ల రాజీనామా: ఈసీ
* ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్
* ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే: కేసీఆర్
* రేపటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం
* నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
* IPL: పంజాబ్‌పై ముంబై విజయం

News April 19, 2024

IPL: పంజాబ్‌పై ముంబై విజయం

image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. శశాంక్ 41(25), అశుతోశ్ 61(27) శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో పంజాబ్ 183 రన్స్‌కే పరిమితమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, గెరాల్డ్ చెరో 3 వికెట్లతో రాణించారు. ఈ సీజన్‌లో MIకి ఇది మూడో విజయం కాగా, PBKSకు ఐదో ఓటమి.

News April 19, 2024

భారీ ధరకు ‘గేమ్ ఛేంజర్’ నార్త్ రైట్స్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ రూ.75 కోట్లకు నార్త్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

News April 18, 2024

IPLలో హిట్‌మ్యాన్ మరో ఘనత

image

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో ఘనత సాధించారు. 6,500కుపైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అంతకుముందు విరాట్ కోహ్లీ (7,624), శిఖర్ ధవన్ (6,768), డేవిడ్ వార్నర్ (6,563)ఈ ఫీట్ నమోదు చేశారు.

News April 18, 2024

కింద పడటంతో నా బ్రెయిన్ దెబ్బతినింది: హీరోయిన్ తానీషా ముఖర్జీ

image

తన మొదటి సినిమా షూటింగ్‌లో కొండ మీద నుంచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైందని హీరోయిన్ తానీషా ముఖర్జీ వెల్లడించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ బాధతోనే షూటింగ్ పూర్తి చేశా. 2 గంటలు షూటింగ్ చేస్తే 3 గంటలు పడుకునేదాన్ని. సాధారణ స్థితికి రావడానికి ఏడాది పట్టింది’ అని తెలిపారు. ఈమె తెలుగులో కంత్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్‌గా చేశారు.

News April 18, 2024

కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ.. ఇద్దరు భారత సంతతి వ్యక్తుల అరెస్ట్

image

గత ఏడాది 20 మిలియన్ కెనడియన్ డాలర్ల(దాదాపు రూ.121 కోట్లు) విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కంటెయినర్‌ను టొరంటోలో దుండగులు చోరీ చేశారు. ఈ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. దుండగులు నకిలీ పత్రాలతో ఎయిర్‌పోర్టు నుంచే కంటెయినర్‌ను తీసుకెళ్లారు. కెనడా చరిత్రలోనే ఇది అతిపెద్ద దోపిడీ. ఇప్పటి వరకు ఆ సొత్తు ఆచూకీ దొరకక పోవడం గమనార్హం.

News April 18, 2024

A-ఫారం, B-ఫారం అంటే ఏంటి?

image

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి B-ఫారం అనే మాట వింటుంటాం. అలాగే A-ఫారం అని కూడా ఒకటి ఉంటుంది.
A-ఫారం: పార్టీ కమిటీ ఒకరిని ఎంపిక చేసి(సాధారణంగా పార్టీ అధ్యక్షులు) A-ఫారం ఇస్తుంది. అతను ఈ పత్రాన్ని ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అతనికి మాత్రమే తమ అభ్యర్థులకు B-ఫారం ఇచ్చే అధికారం ఉంటుంది.
B-ఫారం: ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులు వీరేనంటూ ఇచ్చేదే B-ఫారం. అతనికి పార్టీ గుర్తు వర్తిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

శరీరంలో కొవ్వు ఎక్కువైతే వచ్చే సమస్యలివే!

image

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే లోపలి కండరాల్లో తిమ్మిరి వస్తుందని, శరీర భాగాలు బలహీనంగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుందంటున్నారు. మెదడుకు సరఫరా అయ్యే రక్తంపై ప్రభావం పడి తలనొప్పి, మతిమరుపు వస్తుందని.. గ్యాస్, అజీర్ణం, చర్మంపై దురద, మంట, మగవారిలో లైంగికాసక్తి, వీర్యకణాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

News April 18, 2024

‘ఇంపాక్ట్ ప్లేయర్’తో ఆల్‌రౌండర్లకు నష్టం: రోహిత్

image

IPLలో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు తాను వ్యతిరేకమని రోహిత్ శర్మ చెప్పారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘సాధారణంగా క్రికెట్‌ను 11 మందితోనే ఆడతారు.. 12 మందితో కాదు. ఈ రూల్‌ను ఆటలో వినోదం కోసం ప్రవేశపెట్టారు. అయితే దీనివల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. ఇది వాళ్లను వెనక్కి లాగడమే. భారత జట్టుకూ మంచిది కాదు’ అని పేర్కొన్నారు.

News April 18, 2024

తండ్రయ్యాక పార్టీలకు వెళ్లడం మానేశా: నిఖిల్

image

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తున్నట్లు హీరో నిఖిల్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరిలో <<12710949>>బాబు<<>> పుట్టాడు. అతని పేరు ధీర సిద్ధార్థ్. బాబు బాధ్యతను పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా. వారానికి ఒక్కసారైనా పార్టీలకు వెళ్లే అలవాటును పూర్తిగా మానేశా. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటికి దూరం కావాల్సిందే’ అని పేర్కొన్నారు.