news

News April 18, 2024

మ.3 గంటల వరకు బయటికి రావొద్దు: వాతావరణ శాఖ

image

AP: రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో 42-45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. కాగా నిన్న అత్యధికంగా కడప జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 18, 2024

ఫేక్ న్యూస్‌ను కట్టడి చేద్దాం

image

Way2News పేరుతో కొందరు చేసే అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండండి. ఈ ఫేక్ న్యూస్ గుర్తించడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీకు వచ్చే స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో సేమ్ ఆర్టికల్ వస్తే అది మేము పబ్లిష్ చేసిన వార్త. వేరే కంటెంట్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా అది మా లోగో వాడి రూపొందించిన ఫేక్ న్యూస్. వీటిని grievance@way2news.comకు పంపండి.

News April 18, 2024

జగన్‌పై దాడి కేసులో కోర్టులో పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు అనుమానితుల వివరాలు తెలపాలంటూ సలీం అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ను నియమించాలని న్యాయవాది పేర్కొన్నారు. త్వరలోనే ఈ పిటిషన్ విచారణకు రానుంది.

News April 18, 2024

7,34,000 షేర్లు అమ్మేశారు

image

దేశంలోనే టాప్ స్టాక్ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా వ్యాపారం తిరోగమనంలో పడింది. ఆయన మరణం తర్వాత పగ్గాలు అందుకున్న తన భార్య రేఖా.. టాటా కమ్యూనికేషన్స్‌లో 7,34,000 షేర్లు విక్రయించారు. దీంతో వాటా 1.84%-1.58%కి పడిపోయింది. ఆమెకు 26సంస్థల్లో షేర్లు ఉండగా క్రిసిల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్, NCC, కెనరా బ్యాంక్‌తో సహా 5 కంపెనీల్లో వాటా తగ్గింది.

News April 18, 2024

అభిమాని కోరిక తీర్చిన గౌతమ్ గంభీర్

image

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లై ఇచ్చారు. ‘గౌతి.. ఈరోజున నా బర్త్ డే. మీరు నాకు విషెస్ తెలియజేస్తే దానిని నేను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి గంభీర్ స్పందిస్తూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి’ అంటూ విషెస్ తెలిపారు.

News April 18, 2024

భారత్‌ గురించి మస్క్ ట్వీట్.. US రియాక్షన్

image

X(ట్విటర్) అధినేత మస్క్ ఈ నెలలో భారత్‌‌కు రానున్న నేపథ్యంలో గతంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘అత్యధిక జనాభా ఉన్న భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి వీటో అధికారం ఉండాలి. శక్తిమంతమైన దేశాలు వాటి పవర్‌ను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు’ అని అన్నారు. దీనిపై US ప్రతినిధి తాజాగా స్పందిస్తూ UN వ్యవస్థలో సంస్కరణలకు తాము అనుకూలంగా ఉన్నామన్నారు.

News April 18, 2024

సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుల అరెస్ట్?

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్‌పై సతీశ్ దాడి చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు భావిస్తున్నారు. వీరి అరెస్టుపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. మరికాసేపట్లో పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.

News April 18, 2024

నవ్వాలనిపిస్తే పంత్‌తో మాట్లాడతా: రోహిత్

image

స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ గురించి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను నవ్వించే వారెవరైనా ఉన్నారంటే అది పంత్ ఒక్కడే. అతను క్రేజీగా ఉంటాడు. ప్రమాదం కారణంగా కొన్ని రోజులు క్రికెట్‌కు దూరం అవడంతో చాలా నిరాశ చెందాను. అతను తిరిగి వచ్చి క్రికెట్ ఆడటం చూసి చాలా సంతోషించా. నాకెప్పుడైనా నవ్వాలనిపిస్తే వెంటనే పంత్‌కి కాల్ చేస్తా’ అని రోహిత్ చెప్పారు.

News April 18, 2024

మైదా ఎలా తయారవుతుంది? మంచిది కాదా?

image

గోధుమల్లో ఊక(పైపొట్టు), బ్రాన్(పైపొరతో), పాలిష్డ్ అని 3 దశలుంటాయి. పైపొర తీసేసి గోధుమలను మెత్తగా చేస్తే దాన్ని మైదా అంటారు. అయితే గోధుమ రవ్వకు, మైదాకు పెద్ద తేడా లేదని పీడియాట్రీషియన్స్, న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మైదా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటూనే.. ఇంటర్నెట్లో చూపించేంత భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు, అధిక బరువున్న మహిళలు తినకూడదట.

News April 18, 2024

KCR అన్న కొడుకుపై మరో కేసు నమోదు

image

TG: BRS అధినేత KCR అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ PSలో మరో కేసు నమోదైంది. ఓ సమస్య పరిష్కారం కోసం కలిస్తే తనను గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి డబ్బులు వసూలు చేశారని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. నందిని అనే మహిళతో కలిసి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడని బాధితుడు విజయవర్ధన్ పేర్కొన్నారు. కాగా మన్నెగూడ భూవివాదం కేసులో ఇప్పటికే కన్నారావు అరెస్టైన సంగతి తెలిసిందే.