India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే జగన్ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘జగన్ గారి సతీమణిని అనడానికి ఎంతసేపు పడుతుంది. పెళ్లాం అనే పదం మనం వాడుతామా? CM దిగజారి మాట్లాడుతున్నారు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డున పడేశాడు. పోలవరం, రాజధాని లేకుండా చేశారు. మహిళల అదృశ్యం, దళితులపై దాడులు, నీ నిరంకుశ పాలన చూస్తుంటే ప్రజలకు మండదా? జగన్’ అని నిలదీశారు.
సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఆపలేరు అనడానికి నిదర్శనం కేరళకు చెందిన సారిక. ఈమె పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు. కుడి చేయి పూర్తిగా పని చేయదు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో సారిక 922వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటే విశ్వం మొత్తం మనకు సహకరిస్తుంది అనడాన్ని విశ్వసిస్తానని చెప్పారు.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి అప్రతిష్ఠపాలైంది. ఇంతకుముందు గుజరాత్ అత్యల్పస్కోరు 125/6గా ఉంది. కాగా ఆ జట్టు 100 పరుగులలోపు ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.
AP: నరేంద్ర మోదీతో మాట్లాడే ధైర్యం జగన్‌కు లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాడట. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై చర్చ సమయంలో సోనియా గాంధీ ముందు ప్లకార్డు పట్టుకోలేని పిరికివాడివి నువ్వు. అలాంటిది మోదీతో మాట్లాడగలవా?’ అని ఫైరయ్యారు. సంపద సృష్టించడం కంటే డబ్బులు పంచడం చాలా సులభం అని పవన్ వ్యాఖ్యానించారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రసారం కానుందని టాక్. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు.
తెలంగాణలో ఇవాళ ఎండ దంచికొట్టింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. నల్గొండ జిల్లాలోని నిడమనూర్‌లో 44.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండవేడిమితో అల్లాడిపోయారు. అయితే అనూహ్యంగా సాయంత్రానికి మబ్బులు కమ్ముకొని, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా విపరీతమైన ఎండలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాపై బాలీవుడ్‌లో భారీగా అంచనాలున్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ పొందేందుకు భారీగా డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, భారీ ధరకు ఓ పాపులర్ డిస్ట్రిబ్యూటర్ హిందీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 15న బాక్సాఫీస్‌ను బద్ధలు కొట్టనుందని అంచనా వేస్తున్నాయి.
రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గం గుంటూరు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి రఘురామయ్య, రాయపాటి 4సార్లు, ఎన్జీ రంగా 3సార్లు గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలో 17,69,225 మంది ఓటర్లు ఉన్నారు. TDP నుంచి గత రెండు సార్లు గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి పోటీ నుంచి తప్పుకోగా.. పెమ్మసాని చంద్రశేఖర్‌ని TDP బరిలోకి దింపింది. ఇటు పొన్నూరు MLA కిలారి రోశయ్యను YCP పోటీ చేయిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>
రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే త్రిపురలో మొబైల్ బిల్లు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల వరకు వచ్చేదని అన్నారు. గతంలో ఇక్కడ టవర్లు పనిచేసేవి కావని, ప్రస్తుతం తాము 5G కనెక్టివిటీ కోసం పనులు చేపట్టామని చెప్పారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల మొబైల్ బిల్లు నెలకు రూ.500కు తగ్గిందని త్రిపుర ఎన్నికల ప్రచారంలో వివరించారు.
పాకిస్థాన్ ప్రభుత్వం ట్విటర్(X)ను తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ధ్రువీకరించింది. అయితే అప్పటినుంచి పునరుద్ధరించలేదు. దీంతో ట్విటర్ సంస్థ పాక్‌లోని సింధ్ కోర్టుకెళ్లగా.. తిరిగి పునరుద్ధరించాలంటూ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయంటూ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Sorry, no posts matched your criteria.