India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పేసర్ మహ్మద్ షమీని వదిలేయాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా ఆయన ఆటకు దూరం కావడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లను అట్టి పెట్టుకుంటుందని టాక్.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ తర్వాత మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా టైటిల్‌ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ‘ఇక్కడ ఇల్లాలు అక్కడ ప్రియురాలు’, ‘ఇంట్లో ఇల్లాలు-పోలీస్ స్టేషన్లో ప్రియురాలు’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
పాన్ ఇండియా మూవీగా రానున్న రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ హిందీ హక్కుల్ని అనిల్ తడానీకి చెందిన AA Films దక్కించుకుంది. మూవీ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ హక్కుల్ని కూడా కొనుగోలు చేయడం గమనార్హం. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
విజయమ్మ రాసిన లేఖపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ‘రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన’ అంటూ తల్లి లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన <<14483748>>లేఖలో<<>> స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్‌కి IPLలో డిమాండ్ అమాంతం పెరిగింది. సన్‌రైజర్స్ అతడిని రిటెయిన్ చేసుకోవట్లేదన్న సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో సీఎస్కే, ముంబై, గుజరాత్ జట్లు అతడిని వేలంలో దక్కించుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. మరి SRH సుందర్‌ని వేలంలో తిరిగి దక్కించుకుంటుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
AP: ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతోందని వస్తున్న వార్తలపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. కరెంట్ ఛార్జీలు పెంచడం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని NHRC యాక్టింగ్ ఛైర్‌పర్సన్ విజయభారతికి వైసీపీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. ‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా యాప్‌ను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మహిళల భద్రతపై కమిషన్ స్పందించాలి’ అని పేర్కొంది.
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో సీఎం చర్చిస్తున్నారు. కాగా వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.