India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPLలో అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యాపై మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్‌కు పాండ్యా ఎంపిక కావడం కష్టమని అభిప్రాయపడ్డారు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించారు. అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తేనే దూబే వరల్డ్ కప్‌కి ఎంపిక కాగలరని వ్యాఖ్యానించారు.
APలో నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. 2014లో నోటాకు 1,56,121 ఓట్లు పడగా.. 2019 నాటికి ఆ సంఖ్య 4,01,315కి పెరిగింది. ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇటు అధినేతల ఇలాఖాల్లోనూ ఇవి ఎక్కువగానే పడ్డాయి. 2019లో చంద్రబాబు సెగ్మెంట్ కుప్పంలో 2,905, సీఎం జగన్ పులివెందులలో 2,160, పవన్ పోటీ చేసిన గాజువాకలో 1,764, భీమవరంలో 1,492 మంది నోటా బటన్ నొక్కేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బాందా జిల్లాలో శివ చంద్ర బట్టల దుకాణానికి వెళ్లిన ఓ కస్టమర్ ఫ్రాక్ కొన్నాడు. అది సైజ్ సరిపోకపోవడంతో మరుసటి రోజు ఆ దుకాణానికి వెళ్లి కొంత పెద్ద సైజు ఇవ్వాలని అడిగాడు. దుకాణ యజమాని రూ.50 అదనంగా చెల్లించాలని కోరారు. చెల్లించబోనన్న కస్టమర్ అతడితో గొడవకు దిగి చివరికి దుకాణదారుడి ఎడమచేతి వేలిని కొరికేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారవ్వగా పోలీసులు అరెస్ట్ చేశారు.
పూజారా ఐపీఎల్‌లో కొన్ని సీజన్ల క్రితం సీఎస్కేకు ఆడారు. ఇప్పుడు మళ్లీ అదే టీమ్‌లో ఆడనున్నారా? పుజీ చేసిన ఓ ట్వీట్ నెట్టింట ఇదే చర్చకు దారి తీసింది. ‘supper kings’ హ్యాష్ ట్యాగ్‌తో ‘ఈ సీజన్‌లో మీతో చేరేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ చెన్నైకు ఆడతారా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇదేదైనా యాడ్‌కు సంబంధించింది కావొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
AP: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని CM జగన్ ట్వీట్ చేశారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేడ్కర్ గారు. పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికై తన జీవితాన్ని అంకితం చేసిన ఆయనపై గౌరవాన్ని భావితరాలకు గుర్తుండేలా 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఆ మహనీయుడికి ఘన నివాళులు’ అని Xలో పోస్ట్ చేశారు.
మైత్రీ మూవీస్ యజమాని యెర్నేని నవీన్‌పై జూబ్లీహిల్స్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్ కేర్ ఫౌండర్ చెన్నుపాటి వేణు ఫిర్యాదు మేరకు మాజీ DCP రాధాకిషన్‌తోపాటు 9 మందిపై పోలీసులు FIR నమోదు చేశారు. క్రియా హెల్త్ కేర్‌లో డైరెక్టర్‌గా నవీన్ ఉండేవారు. అందులోని మిగతా డైరెక్టర్లు, కొందరు పోలీసులు కలిపి తనను కిడ్నాప్ చేశారని వేణు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఇటీవల జరిగిన కాల్పులు తమ పనేనని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘సల్మాన్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మా బలమేంటో నీకు అర్థమై ఉంటుంది. దాన్ని పరీక్షించొద్దు. ఈసారి తుపాకీ పేలుడు ఇంటి బయటితో ఆగదు’ అని పేర్కొన్నారు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అన్మోల్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. SI పోస్టులు 452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4,208 ఉన్నాయి. మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. SI పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణులై, 18-28 ఏళ్ల వయసు(రిజర్వేషన్‌ను బట్టి సడలింపు) ఉన్న వారు అర్హులు. CBT, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://rpf.indianrailways.gov.in/
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా స్వీయ దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమా ‘రాయన్’. తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మటన్ కొట్టు రాయన్‌గా ధనుశ్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కూడా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
TG: గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ 100 హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు BRSకు లేదని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అందజేసే పార్టీ కాంగ్రెస్ అని నొక్కి చెప్పారు.
Sorry, no posts matched your criteria.