news

News April 14, 2024

ఇండియాకు +91 కోడ్ ఎలా వచ్చిందంటే..

image

భారత్‌లోని ఫోన్ నెంబర్లకు అంతర్జాతీయ కాల్స్ చేయాలంటే నెంబర్‌కు ముందు +91 కలపాల్సి ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలుసా? దేశాలకు ఈ కోడ్‌లను ఐక్యరాజ్యసమితి కేటాయించింది. అందుకోసం వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించింది. వీటిలో 9వ జోన్‌లో ఆసియా, గల్ఫ్ దేశాలున్నాయి. ఈక్రమంలోనే భారత్‌కు +91, పాక్‌కు +92, అఫ్గాన్‌కు +93 వరుసలో కోడ్‌లను కేటాయించింది.

News April 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 14, 2024

సీఎం జగన్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: వైద్యులు

image

AP: ముఖ్యమంత్రి జగన్‌కు చికిత్స పూర్తైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు ఎడమ కనుబొమ్మపై మూడు కుట్లు వేసినట్లు తెలిపారు. ట్రయాంగిల్ షేప్‌లో ఒక సెంటీమీటర్ లోతుకు గాయం అయిందని, అయితే మరీ లోతుగా గాయం కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన యథాతథంగా యాత్ర కొనసాగించొచ్చని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

News April 14, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 14, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున గం.4:47 సూర్యోదయం: ఉదయం గం.6:01 జొహర్: మధ్యాహ్నం గం.12:16 అసర్: సాయంత్రం గం.4:43 మఘ్రిబ్: సాయంత్రం గం.6:32 ఇష: రాత్రి గం.07.46 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 14, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 14, ఆదివారం
చైత్రము శు.షష్ఠి: ఉదయం: 11:44 గంటలకు
ఆరుద్ర: మరుసటి రోజు అర్ధరాత్రి 12:49 గంటలకు
దుర్ముహూర్తం: సాయంత్రం 04:39 నుంచి 05:29 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 09:29 నుంచి రాత్రి 11:08 వరకు

News April 14, 2024

జగన్‌పై దాడి.. స్పందించిన మోదీ, చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు X (ట్విటర్) వేదికగా స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ దాడిని ఖండించిన చంద్రబాబు, ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

News April 14, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➥AP: విజయవాడలో సీఎం జగన్‌పై ఆగంతకుడి రాయి దాడి
➥జాగ్రత్త జగన్ అన్న: KTR
➥సీఎం జగన్‌పై దాడి బాధాకరం: షర్మిల
➥AP: కోడికత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్: TDP
➥నేను సీఎంగా ఉండుంటే పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు
➥TG:నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది: KCR
➥BRS వల్ల నా కుటుంబం చీలిపోయింది: కేకే
➥దొంగలు పోయి గజదొంగలు వచ్చారు: కిషన్ రెడ్డి
➥IPL: పంజాబ్‌పై రాజస్థాన్ విజయం

News April 13, 2024

నిషేధాన్ని త్రుటిలో తప్పించుకున్న పంత్

image

నిన్న లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ పంత్ త్రుటిలో నిషేధ ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఇప్పటికే అతడి జట్టు 2సార్లు ఆలస్యంగా ఓవర్లు కంప్లీట్ చేయడంతో 2సార్లు పంత్‌కు ఫైన్ పడింది. మళ్లీ రిపీట్ అయితే అతడిపై ఒక మ్యాచ్ నిషేధం అమలవుతుంది. నిన్న మ్యాచ్‌లోనూ 16వ ఓవర్‌ వరకు వెనుకబడి ఉండగా.. మిగిలిన 4 ఓవర్లలో ఢిల్లీ వేగంగా బౌలింగ్ చేయడంతో పంత్ త్రుటిలో నిషేధాన్ని తప్పించుకున్నారు.

News April 13, 2024

IPL: రాజస్థాన్ విజయం

image

ఐపీఎల్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఛేదనలో చెమటోడ్చింది. ఆఖర్లో హెట్మెయిర్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో గట్టెక్కింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి(39) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడ, కరన్ చెరో 2 వికెట్లు, అర్షదీప్, లివింగ్‌స్టన్, హర్షల్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.

News April 13, 2024

కంటెంట్ క్రియేటర్ జంట ఆత్మహత్య

image

అభిప్రాయ భేదాలతో కంటెంట్ క్రియేటర్ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. గ్రావిట్(25), నందిని(22) హరియాణాలోని బహదూర్‌గఢ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ సమయంలో భేదాభిప్రాయాలు రావడంతో మనస్తాపం చెందారు. ఏడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.