India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొలంబియా దేశ రాజధాని బొగోటా సిటీ మేయర్ కార్లోస్ ఫెర్నాండో గాలన్ ప్రజలకు వింత సూచన చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దంపతులు కలిసి స్నానం చేయాలని.. తద్వారా కాస్త నీరు ఆదా అవుతుందని సలహా ఇచ్చారు. అలాగే హాలిడేస్‌లో లేదా బయటకు వెళ్లని రోజుల్లో స్నానం చేయడం మానుకోవాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తప్పవని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తమిళనాడులోని ప్రతిపక్ష AIADMKకు మద్దతిస్తామని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు ఉంటుందన్నారు. BJPతో పొత్తు పెట్టుకునేందుకు AIADMK తిరస్కరించిందని, భవిష్యత్తులోనూ ఒప్పుకోబోదని ఒవైసీ అన్నారు. కేంద్రంలోని BJP తీసుకొచ్చిన CAA, NPR, NRCలను సైతం తమిళనాడులోని AIADMK వ్యతిరేకిస్తోందని, అందుకే ఆ పార్టీకి తాము మద్దతిస్తున్నట్లు ఒవైసీ ప్రకటించారు.
ప్రముఖ ఐటీ కంపెనీ TCSలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2004లో ప్రారంభమైన ఈ సంస్థలో ఏటా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, 19 ఏళ్లలో తొలిసారి 2023-24లో సిబ్బంది సంఖ్య 13,249 మేర తగ్గింది. 2022-23లో 6,14,795 మంది ఎంప్లాయీస్ ఉండగా, 2023-24లో ఆ సంఖ్య 6,01,546కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఐటీ రంగానికి డిమాండ్ తగ్గడం, ఆర్థిక తిరోగమనం వల్ల ఈ పరిస్థితి ఉన్నట్లు నిపుణుల అంచనా.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవాళ ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
TG: హైదరాబాద్‌లో మరో చిన్నారి కుక్క కాటుకు బలైంది. జీడిమెట్లలో దారుణం జరిగింది. దీపాళి(2)పై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కొద్ది నెలలుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసీస్‌తో 2014లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జాన్సన్ బౌలింగ్‌ను సవాలుగా తీసుకుని ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పారు. ‘తొలి మ్యాచ్‌లో జాన్సన్ బంతి నా తలకు తగిలింది. ఎడమ కంటి చూపు కాస్త మందగించడం ప్రారంభమైంది. లంచ్ సమయంలో పోరాడాలా? ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవాలా? అని ఆలోచించా. జాన్సన్‌కు దీటుగా సమాధానం ఇవ్వాలనుకున్నా. చివరకు అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నా’ అని తెలిపారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 4 శతకాలు బాదారు.
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని రివీల్ చేసింది. రేపు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆ టీమ్ ప్లేయర్లు ఈ మెరూన్ రంగు జెర్సీలో బరిలోకి దిగనున్నారు. కోల్‌కతాలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్‌కు గౌరవార్థంగా లక్నో ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీ వేసుకోనున్నారు. ఇక ఈ ప్రత్యేక జెర్సీ పాన్ పసంద్ చాక్లెట్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును CM కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 15న విచారించనుంది. తన అరెస్టు అక్రమమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించి, ఆ తర్వాత మరో 4 రోజులు పొడిగించింది. అది ముగిశాక ఈనెల 15 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది.
TG: కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ 4 నెలల్లోనే వెనక్కి తీసుకెళ్లిందని MLA హరీశ్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ ఫేక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న BJP ప్రజలకు చేసిందేమీ లేదు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది. నిరుద్యోగం, పేదరికం పెరిగింది.’ అని అన్నారు.
జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన జట్టును ఎంపిక చేశారు. తన టీమ్‌లో రింకూ సింగ్‌ను కాదని రియాన్ పరాగ్‌కు చోటు కల్పించడం గమనార్హం.
కైఫ్ T20WC టీమ్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, పంత్, అక్షర్, జడేజా, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, చాహల్, దూబే, పరాగ్, సిరాజ్
☞ ఈ టీమ్ టైటిల్ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా.. కామెంట్ చేయండి
Sorry, no posts matched your criteria.