news

News April 12, 2024

జగన్‌ను జైలుకు పంపుతాం: పవన్ కళ్యాణ్

image

AP: సీఎం జగన్‌ను జైలుకు పంపడం ఖాయమని, ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేదే ప్రశ్న అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాను విజయవాడ ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుండగా ఓ న్యూస్ పేపర్‌లో ‘మోదీ గ్యారంటీ.. అవినీతిపరులంతా జైలుకే’ అనే హెడ్డింగ్ ఆకట్టుకుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చారు.

News April 12, 2024

అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’

image

అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై 75MM వ్యాసార్థంతో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. దాదాపు 6 నిమిషాలపాటు ఈ అపురూప దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.

News April 12, 2024

రామ్ చరణ్, జాన్వీ ఆ సినిమా సీక్వెల్ చేయాలి: చిరంజీవి

image

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. త్వరలోనే ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చరణ్‌తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతుంటే శ్రీదేవి గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యా. ఇండస్ట్రీ ఓ మంచి నటిని కోల్పోయింది’ అని పేర్కొన్నారు.

News April 12, 2024

భళా.. బదోని: లోయర్‌ ఆర్డర్‌లో వారియర్

image

ఆయుష్ బదోని(LSG) లోయర్ ఆర్డర్‌లో అదరగొడుతున్నారు. ఆ జట్టు తరఫున 6 లేదా దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన 5 సందర్భాల్లోనూ ఇతనే పార్ట్‌నర్. 2023లో పూరన్‌తో కలిసి 84, 74, 59 రన్స్, ఇవాళ అర్షద్‌తో కలిసి 73*, 2022లో KLతో కలిసి 47 రన్స్ చేశారు. అలాగే IPL హిస్టరీలో 8 లేదా దిగువ స్థానాల్లో రెండో అత్యధిక భాగస్వామ్యం(73*) నెలకొల్పిన జంటగా బదోని-అర్షద్ ఘనత సాధించారు.

News April 12, 2024

GOOD NEWS చెప్పనున్న ప్రభుత్వం?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు HRAను సవరించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. డీఏ 50శాతానికి చేరిన నేపథ్యంలో X కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30శాతం, Y కేటగిరీల ఉద్యోగులకు 20శాతం, Z కేటగిరీ ఉద్యోగులకు 10% రేట్లు సవరించాలని 7వ వేతన సవరణ కమిషన్ గతంలో వెల్లడించింది. దీంతో HRAలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News April 12, 2024

సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: రేపు 14వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. నంబూరు బైపాస్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. కాజా, మంగళగిరి మీదుగా ఉ.11 గంటలకు CK కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో మాట్లాడుతారు. అనంతరం కుంచనపల్లి, తాడేపల్లి, వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు మీదుగా కేసరపల్లికి చేరుకుని రాత్రి బస శిబిరంలో నిద్రిస్తారు.

News April 12, 2024

అన్నామలైపై కేసు నమోదు

image

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కోయంబత్తూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారని దాఖలైన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. కాగా కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అన్నామలై పోటీ చేస్తున్నారు.

News April 12, 2024

బీజేపీలోకి రేవంత్.. కారణమదే: కేటీఆర్

image

TG: బీజేపీలో చేరుతారనే ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఓటుకు నోటు కేసులో కేంద్రం విచారణ చేయొచ్చని రేవంత్ భయం. సికింద్రాబాద్, కరీంనగర్, NZB, చేవెళ్ల, ADB లాంటి స్థానాల్లో BJP ఎంపీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్ చర్యలు కనిపిస్తున్నాయి. ఎలాగో బీజేపీలో చేరుతాను కాబట్టి.. నలుగురు బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుందాం అనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లున్నారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

News April 12, 2024

LSGvsDC: ఢిల్లీ టార్గెట్ 168 రన్స్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 167/7 స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ 39, డికాక్ 19 రన్స్ చేయగా, చివర్లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులతో అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.

News April 12, 2024

విద్యార్థినులకు ‘పీరియడ్’ సెలవులు: పంజాబ్ వర్సిటీ

image

చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థినులకు పీరియడ్ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఒక సెమిస్టర్‌కు గరిష్ఠంగా 4 లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు ఉండవని వెల్లడించింది. కాగా కేరళలోని కొచ్చిన్ వర్సిటీ, నల్సార్(HYD), గువాహటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.