India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్ డెస్టినేషన్‌గా Way2News మరోసారి నిలిచింది. ఇవాళ విడుదలైన AP ఇంటర్ రిజల్ట్స్‌ను మన యాప్ అందరికంటే ముందు అందించింది. మిగతా ప్లాట్‌ఫాంలతో పోలిస్తే వేగంగా, సులభంగా ఫలితాలు ఇవ్వడంతో ఏకంగా 92% మంది విద్యార్థులు Way2Newsలో తమ రిజల్ట్స్ తెలుసుకున్నారు. ఇది మా వేగం, మా పట్ల యూజర్ల విశ్వాసం తెలిపేందుకు ఓ ఉదాహరణగా ఉంది. ఇదే ఉత్సాహంతో మిగతా పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌నూ అందిస్తాం.
AP: ఉత్తరాంధ్రలో కూటమి పార్టీల్లో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. TDP నుంచి సీటు దక్కని శ్రీకాకుళం, పాతపట్నం Ex MLAలు లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ అసంతృప్తితో ఉన్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ అభ్యర్థులకు సహకరించం అని తెగేసి చెప్తున్నారు. అరకు TDP ఇన్‌ఛార్జ్ దొన్నుదొర ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటు పాలకొండ జనసేన టికెట్ దక్కని పడాల భూదేవి అసమ్మతి వ్యక్తం చేశారు.
AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాలు పలువురి ఇళ్లలో విషాదాన్ని నింపాయి. ఫెయిలయ్యాననే మనస్తాపంతో నరసరావుపేట(M) ఇక్కురు గ్రామంలో విద్యార్థిని అర్చన ఉరి వేసుకుని <<13037716>>ఆత్మహత్య<<>> చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలో గాయత్రి, రామకుప్పంలో మిత్ర పురుగుమందు తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
NOTE: జీవితంలో పరీక్షలు ఓ భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఫెయిలైన వారికి పేరెంట్స్ అండగా ఉండాలి.
TG: వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారు. తొలుత తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన గులాబీ బాస్.. తాజాగా డా.మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. సుధీర్ కుమార్ ప్రస్తుతం హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు.
భారత్‌కు చెందినవారు తన జీవిత కాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నట్లు WPR అధ్యయనంలో తేలింది. 46దేశాల్లో సర్వే చేయగా భారత్ చివరి స్థానంలో నిలిచింది. కాగా సగటున ఓ వ్యక్తి 14.5 మంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉండటంతో తుర్కియే దేశం తొలి స్థానంలో ఉంది. భారతీయ విలువలు, సంస్కృతే ఈ జాబితాలో మన దేశం అట్టడుగున నిలవడానికి కారణమని.. ఇది మంచి పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు.
AP: సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్యకిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేశ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు.
కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, డైనోసార్ల మాదిరిగానే కొన్నేళ్లలో అది అంతరించి పోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ గురించి అడిగితే.. ఎవరని? పిల్లలు ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీలో అంతర్గత పోరు బిగ్‌బాస్ రియాల్టీ షోను తలపిస్తోందని, రోజూ నాయకులు చొక్కాలు చించుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తల్లి శోభ కోరిక మేరకు చెన్నైలో సాయిబాబా దేవాలయం కట్టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్‌తో ఎన్నోసార్లు చెప్పా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని అతను గుడి కట్టించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికొచ్చి పూజలు చేస్తా. విజయ్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం దళపతి.. GOAT అనే చిత్రంలో నటిస్తున్నారు.
వివేకా హత్య కేసుపై నాంపల్లి CBI కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వ్యక్తిగత హాజరుపై MP అవినాశ్, దస్తగిరి మినహాయింపు తీసుకోగా మిగతా ఐదుగురు నిందితులు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించేందుకు తమకు అభ్యంతరం లేదని CBI తెలిపింది. దీనిపై వాదనలు పూర్తి కాగా తీర్పును ఈ నెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహ్మద్ సిరాజ్ IPLలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. అతడి గణాంకాలు చూసి ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. సిరాజ్ దారుణ ప్రదర్శన చూసి నిరాశ చెందుతున్నారు. ఈ IPLలో 6 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లే తీశారు. మరోవైపు పరుగులు కూడా ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సిరాజ్ తిరిగి తన ఫామ్ అందుకుంటే మంచిదని.. లేదంటే T20 WCలో చోటు కష్టమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.