news

News April 11, 2024

అర్జున్‌కు అవకాశం దొరికేనా?

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌కు ఈసారి మైదానంలో దిగే అవకాశం దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ముంబై ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. ఈ సమయంలో అర్జున్‌ను జట్టులోకి తీసుకొనే ప్రయోగం చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అతడు ఇప్పటి వరకు 4మ్యాచ్‌‌ల్లో 3వికెట్లు తీసి, 13రన్స్ చేశారు. ఒకవేళ MI పుంజుకొని ముందుగానే ప్లేఆఫ్స్ చేరుకుంటే నామమాత్రపు మ్యాచుల్లో ఇతడికి ఛాన్స్ ఇవ్వొచ్చు.

News April 11, 2024

బీజేపీకి 400 ఎంపీ సీట్లు సాధ్యమేనా?

image

ఈసారి సొంతంగా 400 MP స్థానాలు సాధిస్తామని BJP ప్రకటించుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ చరిత్రలో ఒకేఒకసారి 1984లో కాంగ్రెస్ 400 స్థానాలు గెలుచుకుంది. మరే ఎన్నికల్లోనూ ఏ పార్టీ అన్ని స్థానాలు సాధించలేదు. నార్త్‌లో సీట్లు సాధించినా..దక్షిణాదిలో డబుల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 400 MPల లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తోందని అంటున్నారు.

News April 11, 2024

కోహ్లీ-రోహిత్ పోరు.. ఆధిపత్యం ఎవరిదంటే?

image

IPL2024లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టీమ్ఇండియా తరఫున అదరగొట్టే రోహిత్-కోహ్లీ ద్వయం పొట్టి లీగ్‌లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. RCBపై రోహిత్ శర్మ 574 పరుగులు చేయగా.. MIపై విరాట్ కోహ్లీ 852 పరుగులు చేశారు. ఆర్సీబీపై అత్యధికంగా బుమ్రా 24 వికెట్లు తీశారు. కాగా వాంఖడేలో ఈ 2జట్లు ఇప్పటివరకు 10సార్లు తలపడగా ముంబై 7,ఆర్సీబీ 3సార్లు విజయం సాధించాయి. మరి ఈరోజు గెలుపెవరిది?

News April 11, 2024

ఆ విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ తరగతులు

image

TG: ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం మార్చి 30 నుంచి మే 31 వరకు హాలిడేస్ ప్రకటించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు, ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులతో సమానంగా మే 15వరకు వేసవి తరగతులు నిర్వహించనున్నాయి. హాలిడే‌స్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నారు.

News April 11, 2024

ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులకు హెచ్చరిక

image

TG: ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ సంఖ్య, కన్సల్టెంట్ డాక్టర్ల పేర్లను విధిగా బోర్డులపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య మండలి ఆదేశించింది. ఫార్మా-డీ డిగ్రీ కలిగిన వారిని, ఆయుష్ డాక్టర్లను డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని, నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

News April 11, 2024

గణేషుడి సేవలో ముంబై ఇండియన్స్ క్రికెటర్లు

image

ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, పీయూష్ చావ్లాతో పాటు LSG ఆటగాడు కృనాల్ పాండ్య కూడా గణేషుడి సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ నేతృత్వంలో ముంబై వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం తన ఖాతాలో వేసుకుంది.

News April 11, 2024

ఓటేస్తే హెయిర్ కట్ ఫ్రీ

image

ఓటు వినియోగంపై ఓ సెలూన్ యజమాని వినూత్న ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తన సెలూన్‌లో ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ ప్రకటించారు. ఓటేసి వచ్చి వేలికి సిరా గుర్తు చూపించి ఫ్రీగా కటింగ్ చేయించుకోవచ్చని షాపు ముందు బోర్డు పెట్టాడు. కాగా రెండో విడతలో భాగంగా మహారాష్ట్రలో ఈనెల 26న 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

News April 11, 2024

మూడు నెలల్లో 3 గాయాల నుంచి కోలుకున్నా: సూర్యకుమార్

image

మూడు నెలల్లో 3 గాయాలతో పోరాడినట్లు ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలికి గాయాలైనట్లు తెలిపారు. ఒక్కో గాయం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. ఎన్‌సీఏలో ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఢిల్లీతో మ్యాచులో ఎంట్రీ ఇచ్చిన సూర్య డకౌటైన సంగతి తెలిసిందే.

News April 11, 2024

లక్షన్నర మెజార్టీతో గెలుస్తా : మాధవీలత

image

TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.

News April 11, 2024

మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా?

image

మేనరికం, దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులతోపాటు నేత్ర సంబంధ సమస్యలు సంక్రమించే ప్రమాదం ఉందని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడయింది. కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా తలెత్తే ముప్పు ఉందని తేలింది. కంటిని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందంది. సమస్యలను ముందే గుర్తిస్తే శస్త్ర చికిత్సలు, మందుల ద్వారా నివారించవచ్చని పేర్కొంది.