India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1894: వ్యాపారవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా జననం
1898: స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత దశిక సూర్యప్రకాశరావు జననం
1941: భారత మాజీ దౌత్యవేత్త మణి శంకర్ అయ్యర్ జననం
1995: భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మరణం
* ప్రపంచ హోమియోపతి దినోత్సవం
* అంతర్జాతీయ తోబుట్టువుల రోజు
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందనడానికి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని అమెరికా సెనేట్ సాయుధ బలగాల కమిటీకి ఆ దేశ రక్షణ మంత్రి ఆస్టిన్ తెలిపారు. గత అక్టోబరు నుంచి హమాస్ ఉగ్రసంస్థపై ఇజ్రాయెల్ గాజాలో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి పౌరులపైనా ఇజ్రాయెల్ మారణహోమం చేస్తోందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిపై తమ వద్ద ఆధారాల్లేవని అమెరికా తాజాగా తేల్చిచెప్పింది.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 10, బుధవారం
చైత్రము
శు.విదియ: సాయంత్రం: 5:32 గంటలకు
భరణి: తెల్లవారుజామున 3:05 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 2:57 వరకు
తిరిగి మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు
* తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
* AP: వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తాం: చంద్రబాబు
* AP: పిఠాపురం నుంచే విజయకేతనం: పవన్ కళ్యాణ్
* AP: చంద్రబాబు, పవన్, మోదీలకు థ్యాంక్స్: YSRCP
* TG: కవిత రిమాండ్ ఈ నెల 23 వరకు పొడిగింపు
* TG: రేవంత్‌కు కాంగ్రెస్ నుంచే ప్రమాదం: కిషన్‌రెడ్డి
* TG: BRS మీటింగ్‌లో పాల్గొన్న ఉద్యోగుల సస్పెండ్
* సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
* IPLలో పంజాబ్‌పై SRH విజయం
పర్యావరణ హితమని EVల హవా కొనసాగుతున్న వేళ USలో ఇన్ఫీనియమ్ సంస్థ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. నీరు, కార్బన్‌డైఆక్సైడ్ (CO2)తో ఇంధనాన్ని తయారు చేస్తోంది. ఎలక్ట్రోలైజర్స్‌తో నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేస్తారు. రియాక్టర్‌లో హైడ్రోజన్, CO2 మధ్య రియాక్షన్ జరిగి ఇంధనం తయారవుతుంది. రోజుకు 8,300 లీటర్ల ఇంధనం ఉత్పత్తి అవుతోందట. 2030కి ఈ ఇంధన మార్కెట్ $50బిలియన్లకు చేరొచ్చని అంచనా.
భారత్‌లో మంగళవారం చంద్రుడు కనిపించని నేపథ్యంలో గురువారం ఈద్ జరుపుకోవాలని ఢిల్లీలోని ఫతేపురి మస్జిద్ ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు. యూపీ, ఎంపీ, బెంగాల్, తెలంగాణ, బిహార్‌లో కనుక్కున్నామని, ఎక్కడా చంద్రుడు కనిపించలేదని ఆయన వివరించారు. లక్నోలోని మర్కాజీ చాంద్ కమిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే కేరళ, జమ్మూకశ్మీర్‌లో మాత్రం రేపు చేసుకుంటున్నట్లు మత పెద్దలు తెలిపారు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 రన్స్ తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 180/6 స్కోరుకు పరిమితమైంది. PBKS బ్యాటర్లు శశాంక్ 46*, అశుతోశ్ 33* చివర్లో వరుసగా బౌండరీలు బాదడంతో ఓ దశలో పంజాబ్ గెలిచేటట్లే కనిపించింది. SRH బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్, ఉనాద్కత్, కమిన్స్, నితీశ్ తలో వికెట్ పడగొట్టారు.
‘మరీ హై కాకుండా, మరీ లోగా కాకుండా మీడియంగా కొట్టరా’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్‌ను రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ చచ్‌న్యా సీరియస్‌గా తీసుకుందేమో! నిమిషానికి 80-116 బీట్లు ఉన్న టెంపోలనే పరిగణిస్తామని మ్యూజిక్‌పై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అంతకంటే స్లో లేదా స్పీడ్ ఉన్న మ్యూజిక్‌ను నిషేధిస్తూ, రీరైట్ చేసుకోవడానికి ఆర్టిస్టులకు JUN 1 వరకు గడువు ఇచ్చింది. చచ్‌న్యా సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేసిందట.
Sorry, no posts matched your criteria.