India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల వేళ మరో BJP నేత రాజ్యాంగంపై కామెంట్ చేసి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది’ అని రాజస్థాన్‌లోని నాగౌర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా పేర్కొన్నారు. కాగా ఇటీవల కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేయగా బీజేపీ ఆయనకు టికెట్ రద్దు చేసింది.
ముంబై కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడంపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ భిన్నంగా స్పందించారు. ఇలాంటి వాటిపై తొందరపడి మాట్లాడితే పొరపాటే అవుతుందని అన్నారు. గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ వరుసగా ఐదు మ్యాచులు ఓడిపోయి MI ఛాంపియన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడే ఓ అంచనాకు రాకుండా మరో రెండు మ్యాచుల వరకైనా వేచి చూడాలని అభిప్రాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వీరిలో 10మంది పురుషులు, ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. మంగళవారం 10మంది మావోల మృతదేహాలు లభించగా ఈరోజు మరో మూడు మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. ఇక్కడ ఏప్రిల్ 19న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
T20 వరల్డ్ కప్ USA వీసా ప్రాసెసింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఢాకాలో వీసా ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. అయితే, ఈనెల 5వ తేదీన జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వరకు ఇండియాకు రాకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనుంది.
AP: రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న 4 రోజులు పలు చోట్ల ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు, అక్కడక్కడ 4- 5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశముందని చెప్పింది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
కేరళలో కదులుతున్న రైలులో నుంచి టీటీఈని తోసేసి ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఎర్నాకుళం నుంచి పట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సదరు వ్యక్తిని టీటీఈ ప్రశ్నించారు. ఈ క్రమంలో టీటీఈని అతను తోసేయడంతో అవతలి పట్టాలపై పడ్డారని, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొని ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాలక్కాడ్ వద్ద నిందితుడు వినోద్‌ని పట్టుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ మూవీ రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రూ.100 కోట్ల దిశగా పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీ, కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ వంటి లీడర్లు పాల్గొననున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో ఈ రోడ్‌షో సాగుతుంది. కాగా 2019లో రాహుల్.. 10లక్షల ఓట్లలో 7లక్షల ఓట్లు సాధించి గెలిచారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో 25ఏళ్ల శాంభవీ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలవనున్నారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. JDU సీనియర్ లీడర్ అశోక్ చౌదరి కుమార్తె అయిన శాంభవి ప్రస్తుతం మగధ్ యూనివర్సిటీలో PhD చదువుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో రెండు మ్యాచుల్లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో ప్లేయర్ మయాంక్ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మయాంక్ ఆడాలని కోరుకున్నారు. 150 KMPHకు పైగా వేగంతో బంతులు విసురుతూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.