India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సామ్ గతంలో అట్లీతో ‘తేరి’, బన్నీతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశారు. పుష్పలో ఐటమ్ సాంగ్‌లో కనిపించారు.
TG: అక్కసుతోనే KCR తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘BRS నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే KCR తట్టుకోలేకపోతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని సమస్యలకు గత ప్రభుత్వమే కారణం. 3 నెలల నుంచి వ్యవస్థలను దారికి తీసుకొస్తున్నాం. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును ఆయన ఒప్పుకోవడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990లలో నటీనటుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేదని అన్నారు. కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉన్నవారు ఇతరుల సక్సెస్‌ను ఓర్వలేకపోయేవారని చెప్పారు. వారిని కిందికి లాగేందుకు అవసరమైతే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లని తెలిపారు. ఇలాంటి పరిస్థితితో తాను ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి ఎవరినీ తీసెయ్యాలని తాను ప్రయత్నించలేదన్నారు.
TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మార్చి 28న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 8 సార్లు టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు A4 రాధాకిషన్‌రావు రిమాండు రిపోర్టులో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు ఈయనే వాహనాలను సమకూర్చినట్లు తేలింది. BRS కోసమే వీరు డబ్బులు తరలించారట. అటు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం.
మార్చిలో రూ.1.78లక్షల కోట్ల GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5శాతం ఎక్కువ. గరిష్ఠంగా ఫిబ్రవరిలో 12.5శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్‌టీలో వృద్ధి (17.6%) నమోదు కావడం వల్ల కలెక్షన్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. FY24లో జీఎస్‌టీ కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14లక్షల కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.
భారతదేశ రక్షణ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY24లో 32.5% పెరిగాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ₹21000 కోట్ల మార్కును దాటాయన్నారు. దేశంలో తయారవుతున్న రక్షణ ఉత్పత్తులను 100+ సంస్థలు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్, DPSUలతో సహా రక్షణ పరిశ్రమలన్నీ గత కొన్నేళ్లలో ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయని కొనియాడారు.
RCB ప్లేయర్ కామెరాన్ గ్రీన్ దీర్ఘకాలిక మూత్ర పిండ వ్యాధితో పోరాడుతున్న రోగులను కలిశారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యాన్నిచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు. గ్రీన్ కూడా స్టేజ్-2 దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో జన్మించగా.. డాక్టర్లు 12 ఏళ్ల కంటే ఎక్కువ బతకరని చెప్పారట. అయితే, వారిని ఆశ్చర్యపరిచేలా కఠినమైన డైట్ పాటిస్తూ, మెడిసిన్స్ వాడుతూ ఆయన కోలుకొని క్రికెటర్‌గా మారారు.
AP: వాలంటీర్లను సస్పెండ్ చేయకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ECని కోరారు. ‘సస్పెండ్ అయిన వాలంటీర్లు ఇంకా ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి వారిని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఉత్తరాంధ్ర వారిని రాయలసీమకు, రాయలసీమ వారిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇలా బదిలీ చేస్తే వారి ప్రభావం ఓటర్లపై ఉండదు. ఎన్నికలు సజావుగా జరుగుతాయి’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.