news

News March 31, 2024

అభిమానం అంటే ఇలానే ఉంటుంది

image

దాదాపు ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌పై ఫ్యాన్స్‌లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. ‘నీవెప్పుడూ ఒంటరి కావు’ అని అర్థం వచ్చేలా ఉన్న పంత్ పోస్టర్‌ను ప్రదర్శించారు. అభిమానం అంటే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News March 31, 2024

తండ్రి కాబోతున్న భారత స్టార్ క్రికెటర్?

image

భారత స్టార్ క్రికెటర్ KL రాహుల్, నటి అతియా శెట్టి(సునీల్ కుమార్తె) తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ‘డాన్స్ దీవానే’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘వచ్చే సీజన్‌లో నేను తాతలాగా వేదికపై నడుస్తాను’ అని తాతయ్యల స్పెషల్ ఎపిసోడ్‌లో సునీల్ శెట్టి అనడంతో ఈ ప్రచారం మొదలైంది. కాగా 2023 జనవరిలో రాహుల్-అతియా పెళ్లైంది.

News March 31, 2024

గేల్ రికార్డు సమం చేసిన వార్నర్

image

ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించారు. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన అర్ధ సెంచరీ బాదారు. దీంతో కలుపుకుని ఆయన ఇప్పటివరకు 110 ఫిఫ్టీలు సాధించారు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకవీరుడు క్రిస్ గేల్ (110) రికార్డును సమం చేశారు. కాగా వార్నర్ ఐపీఎల్‌లో 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆయన ఖాతాలో 4 శతకాలు కూడా ఉన్నాయి.

News March 31, 2024

వర్మ గారికి మర్యాద తగ్గకుండా చూస్తా: పవన్

image

AP: పిఠాపురంలో తన పోటీకి మద్దతిచ్చిన TDP నేత వర్మను జనసేన అధినేత పవన్ ప్రశంసించారు. ‘చంద్రబాబు గీసిన గీత దాటను అని వర్మ చెప్పడం నాకు ఆనందం కలిగించింది. నా గెలుపునకు బాధ్యత తీసుకున్న ఆయనకు.. నేను గెలిచిన తర్వాత మర్యాద, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా. ఒంటెద్దు పోకడలకు పోను. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై 3 పార్టీల నాయకులం ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ వెల్లడించారు.

News March 31, 2024

వేసవిలో ఫోన్ వేడెక్కుతోందా.. ఈ టిప్స్ పాటించండి!

image

మొబైల్స్ సాధారణంగా హీటెక్కుతుంటాయి. వేసవిలో మరింత వేడెక్కి ఇబ్బంది కలిగిస్తాయి. అలా కాకూడదంటే ఈ టిప్స్ పాటించండి.
✦ వేసవిలో బయట తిరిగేటప్పుడు ఫోన్‌కు సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తపడండి
✦ కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి
✦ బ్లూటూత్‌, లోకేషన్‌ సర్వీసెస్‌ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచకూడదు
✦ అనవసరపు యాప్‌లు డిలీట్ చేయాలి
✦ పవర్ సేవ్ మోడ్‌ను ఆన్‌లో పెట్టాలి
✦ ఫోన్ కవర్‌ ఉపయోగించకపోవడమే మంచిది

News March 31, 2024

బీజేపీ 200 స్థానాల్లో గెలిస్తే గొప్ప: మమత

image

బీజేపీకి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. 400 లోక్‌సభ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయపార్టీ.. 200 స్థానాలు గెలిచి చూపించాలని అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 200 స్థానాలు గెలుస్తామని చెప్పి.. 71 దగ్గరే ఆగిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఏఏ, NRCని అనుమతించబోమని తేల్చి చెప్పారు. పౌరసత్వం ఉన్న వారిని విదేశీయులుగా మార్చేందుకు సీఏఏ ఒక మార్గమని ఆరోపించారు.

News March 31, 2024

అలాంటి వాడితోనే డేటింగ్ చేస్తా: కృతిసనన్

image

తనతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డాన్స్ చేసే వ్యక్తితోనే డేటింగ్ చేస్తానని స్టార్ హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ‘విదేశీయులు అందంగా ఉన్నా నాకు అంతగా నచ్చరు. ఇప్పటివరకూ ఏ విదేశీయుడికీ నేను అట్రాక్ట్ కాలేదు. నాకు దేశీ మగాళ్లంటేనే ఇష్టం. నేను డేటింగ్ చేయబోయే వ్యక్తి హిందీ అర్థం చేసుకోవాలి’ అని ఆమె చెప్పారు. కాగా దిగ్గజ క్రికెటర్ ధోనీ సన్నిహితుడు కబీర్ బహియాతో కృతి డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

News March 31, 2024

టీడీపీకి షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్?

image

AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో TDPకి షాక్ తగిలే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ MLA ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు కదిరి టికెట్ దక్కకపోవడంతో మాజీ MLA చాంద్ బాషా TDPకి రాజీనామా చేశారు. రేపు సీఎం జగన్ సమక్షంలో YCPలో చేరనున్నారు. కాగా అనంత టికెట్ దగ్గుపాటి ప్రసాద్, కదిరి టికెట్ వెంకటప్రసాద్‌కు టీడీపీ ఇచ్చింది.

News March 31, 2024

కేసీఆర్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు: అద్దంకి

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో జనం లేరని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. అసెంబ్లీకి కూడా రాని KCR రాజకీయ లబ్ధి కోసమే పొలం బాట పట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని.. ఆయన మొసలి కన్నీరును ఎవరూ పట్టించుకోరని అన్నారు.

News March 31, 2024

రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్

image

AP: వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.