India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. GHMC మేయర్ విజయలక్ష్మి నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్‌ను ఆరాధిస్తారు. తాజాగా RCBvsKKR మ్యాచ్‌లో ఈ జట్టుకు చెందిన ఓ చిన్నారి ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్లకార్డుతో కనిపించింది. ‘RCB కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను’ అనే ప్లకార్డుపై రాసి ఉంది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. తాజాగా సీక్వెల్ టైటిల్‌ను దర్శకుడు అనౌన్స్ చేశారు. ‘మ్యాడ్ మ్యాక్స్’ పేరుతో ఈ మూవీని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 12న షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి అన్ని పాలసీలను తప్పనిసరిగా డిజిటలైజేషన్ చేయాలని బీమా సంస్థలను IRDAI ఆదేశించింది. ఇకపై ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్(EIA) ద్వారా పాలసీలను జారీ చేస్తారు. పేపర్ రహితం కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉండదు. వినియోగదారులు సులభంగా తమ పాలసీ వివరాలు, చెల్లింపుల తేదీలను ట్రాక్ చేయొచ్చు. పాలసీలో చిరునామా, ఇతర వివరాలను ఈజీగా మార్చుకోవచ్చు. వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
‘టిల్లూ స్క్వేర్’ మూవీకి సక్సెస్ టాక్ వస్తుండటంతో హీరోయిన్ అనుపమ స్పందించారు. సినిమా కోసం రెండేళ్ల పాటు పనిచేశానని తెలిపారు. మూవీలో తన నటనకు ప్రశంసలు రావడంతో చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో నటిస్తున్నానని అనౌన్స్ చేయగానే తనపై మొదట విమర్శలు వచ్చాయన్నారు. సక్సెస్ టాక్‌తో వాటన్నింటికీ సమాధానం దొరికిందన్నారు. సినిమాలో తన నటన చూసి రాధిక(నేహా శెట్టి) ఫోన్ చేసి ప్రశంసించినట్లు తెలిపారు.
నిన్న చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరిగిన మ్యాచ్‌లో 83* రన్స్ చేసిన విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే వేదికలో అత్యధిక T20 రన్స్(3,276) చేసిన ఆటగాడిగా నిలిచారు. 3,239 పరుగులతో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్-మీర్పూర్) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్(ట్రెంట్ బ్రిడ్జ్-3,036 రన్స్), బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్(మీర్పూర్-3,020 పరుగులు) ఉన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్‌పై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు నిన్న వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ PSకు పంపగా.. IPC 504, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. CM రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని KTR ఆరోపించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆయనను ఇవాళ విచారించనుంది. ఆయన హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
TG: మహిళలకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ కోసం జీరో టికెట్ల జారీలో కండక్టర్లు తిరకాసు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియోను పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో అవసరం లేకపోయినా ఎక్కువ జీరో టికెట్లు ఇచ్చేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో ఓ కండక్టర్ అదనంగా రూ.లక్ష విలువైన టికెట్లు జారీచేశారు. చాలా చోట్ల ఇలానే జరుగుతుండటంతో ఈ డబ్బులు చెల్లించే ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది.
దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(CMAT)కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏదైనా డిగ్రీ పాసైన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏప్రిల్ 18లోపు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.2,000, మిగతా అందరూ రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: <
Sorry, no posts matched your criteria.