news

News March 30, 2024

శుభ ముహూర్తం

image

తేది: మార్చి 30, శనివారం
బహుళ పంచమి: రాత్రి 09:14 గంటలకు
అనురాధ: రాత్రి 10:03 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 06:04-06:53 గంటల వరకు
06:53-07:42 గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 12:50-02:25 గంటల వరకు

News March 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 30, 2024

టుడే టాప్ స్టోరీస్

image

*AP: విపక్ష పార్టీలకు రాజకీయ సమాధి కట్టండి: CM జగన్
*AP: నాది విజన్.. జగన్‌ది పాయిజన్: చంద్రబాబు
*TG: ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చర్యలు: CM రేవంత్
*TG: పార్టీ మారిన వాళ్లను మళ్లీ చేర్చుకోం: KTR
*AP: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల
*AP: తెలుగుదేశం పార్టీలో చేరిన హీరో నిఖిల్
*TG: కాంగ్రెస్‌లో చేరనున్న BRS ఎంపీ కె.కేశవరావు, MLA కడియం శ్రీహరి
*IPL: RCBపై KKR విజయం

News March 30, 2024

అరుదైన రికార్డును సాధించిన RCB

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 1500 సిక్సులు బాదిన రెండో టీమ్‌గా RCB నిలిచింది. ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీతో పాటు గ్రీన్ చెరో రెండు సిక్సులు బాదారు. మరి ఈ మ్యాచ్‌లో ఎన్ని సిక్సులు నమోదవుతాయో కామెంట్ చేయండి.

News March 29, 2024

IPLలో తొలి బంతికి సిక్స్ కొట్టింది వీరే

image

ఇప్పటివరకు ఐపీఎల్‌లో 9 మంది క్రికెటర్లు తమ డెబ్యూ మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికే సిక్స్ కొట్టారు. ఇటీవల చెన్నై బ్యాటర్ సమీర్ రిజ్వి కూడా ఇలానే సిక్స్ బాదారు. ఇంతకుముందు రాబ్ క్వినీ (RR), కెవోన్ కూపర్ (RR), ఆండ్రె రస్సెల్ (KKR), కార్లోస్ బ్రాత్‌వైట్ (DD), అనికేత్ చౌధరి (RCB), జేవన్ సీర్లెస్ (KKR), మహీశ్ తీక్షణ (CSK), సిద్దేశ్ లాడ్ (MI) తాము ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపారు.

News March 29, 2024

BREAKING: RCB ఘోర ఓటమి

image

RCB ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ IPLలో ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో KKR చేతిలో RCB చతికిలపడింది. 183 పరుగుల టార్గెట్‌ను KKR 3 వికెట్లు కోల్పోయి 19 బంతులు ఉండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ల ముందు RCB బౌలర్లు తేలిపోయారు. వెంకటేశ్ 50, నరైన్ 47, సాల్ట్ 30, శ్రేయస్ 39* పరుగులు చేశారు. అంతకుముందు కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో RCB 182 రన్స్ చేసింది.

News March 29, 2024

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

image

TG: హనుమకొండ జిల్లా కాజీపేట వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్‌(సికింద్రాబాద్-తిరుపతి)లో పొగలు వచ్చాయి. బ్యాటరీ క్యాప్ లీక్ కావడంతోనే ఈ పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో కాజీపేట స్టేషన్‌లో రైలును సుమారు గంటన్నర పాటు నిలిపివేసి మరమ్మతులు చేశారు. తర్వాత రైలు యథావిధిగా వెళ్లిపోయింది.

News March 29, 2024

31న కేసీఆర్ జిల్లాల టూర్

image

TG: ఈ నెల 31న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

News March 29, 2024

ఆమె సీఎం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు: కేంద్రమంత్రి

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ‘మేడం సీఎం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బిహార్ సీఎం లాలూ ప్రసాద్ అరెస్టైనప్పుడు రబ్రీదేవి కూడా ఇలాగే చేశారు’ అని హర్దీప్ సింగ్ పురి ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

News March 29, 2024

జాగ్రత్త.. బయటికి రావొద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు TN, KA, రాజస్థాన్, GT, మహారాష్ట్ర, కేరళలో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.