news

News March 29, 2024

తొలిసారి కలిసికట్టుగా కదం తొక్కనున్న ఇండియా కూటమి – 1/2

image

NDAని పడగొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పడినా, నేతలు తమ ఐక్యత చాటుకున్న సందర్భం ఒక్కటీ లేదు. గత ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతిపై భోపాల్‌లో ర్యాలీ చేపట్టాలని కూటమి నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ నేత కమల్‌‌నాథ్ దానిని క్యాన్సిల్ చేయడంతో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఢిల్లీ CM కేజ్రీవాల్ అరెస్ట్‌పై నిరసనకు ఆదివారం కదం తొక్కాలని కూటమి నిర్ణయించింది.
<<-se>>#Elections2024<<>>

News March 29, 2024

తొలిసారి కలిసికట్టుగా కదం తొక్కనున్న ఇండియా కూటమి – 2/2

image

ప్రస్తుతం ఇండియా కూటమిని అసంతృప్తి జ్వాలలు వెంటాడుతున్నాయి. సీట్ల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరక బెంగాల్‌లో తృణమూల్, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. సీట్ల పంపిణీపై క్లారిటీ రాకముందే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ లిస్టును ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కూటమి శ్రేణులపై ఎంతవరకు ప్రభావితం చేయగలదనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>

News March 29, 2024

స్వల్పంగా పెరగనున్న ఔషధాల ధరలు!

image

పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర ఔషధాల జాబితాలోని మందుల ధరలు 0.0055% పెంచనున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ వెల్లడించింది. అయితే ఇది గత ఏడాది, అంతకుముందు ఏడాది వచ్చిన హైక్స్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఔషధాల ధరలు 2022లో 10%, 2023లో 12% పెరిగాయి.

News March 29, 2024

జగన్ అజ్ఞానానికి ఎవరేం చేయగలం: CBN

image

AP: తాను ప్రజలకు ఏం చేశానని సీఎం జగన్ అడుగుతున్నారని, ఆ విషయం రాష్ట్రంలోని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్‌కు తెలియకపోవడం ఆయన అజ్ఞానం అని, దానికి ఎవరేం చేయగలమని బాబు ప్రశ్నించారు. ‘జగన్.. నా వయసు గురించి మాట్లాడతాడు. నా మాదిరిగా మండుటెండలో ఒక మూడు మీటింగుల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?’ అని సవాల్ విసిరారు.

News March 29, 2024

విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు: విప్లవ్

image

TG: కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తన తండ్రి కే కేశవరావు నిర్ణయం బాధించిందని ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. ‘గతంలో పొన్నాల లక్ష్మయ్య వయసు గురించి సీఎం రేవంత్ విమర్శించారు. మరి 84 ఏళ్ల కేకేను ఎలా పార్టీలో చేర్చుకుంటారు? మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేకే పార్టీ మారుతున్నారు. ఆయన ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. విజయలక్ష్మి బీఆర్ఎస్‌కు తీరని ద్రోహం చేశారు’ అని ఆయన మండిపడ్డారు.

News March 29, 2024

ఫోన్ కాల్స్ వింటే చిప్పకూడు తినాల్సి వస్తుంది: సీఎం

image

TG: ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తారా? కొన్ని ఫోన్ కాల్స్ విన్నామని KTR చెప్తున్నారు. వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. BRS చెప్పినట్టు విన్న అధికారుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా చర్యలుంటాయి’ అని అన్నారు.

News March 29, 2024

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్‌ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ యాక్ట్‌ని ప్రయోగించారు. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్, తిరుపతన్న, భుజంగరావును విచారించారు.

News March 29, 2024

ఏంటీ టెలిగ్రాఫ్ యాక్ట్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు టెలిగ్రాఫ్ చట్టాన్ని జత చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఇతరుల వ్యక్తిగత సంభాషణలు వినేందుకు ఫోన్‌ ట్యాప్ చేస్తే ఈ కేసు నమోదు చేస్తారు. ఇప్పటి వరకూ దేశంలో ఒకట్రెండు కేసులే నమోదయ్యాయి. రాష్ట్ర, కేంద్ర హోం సెక్రటరీ అనుమతి లేకుండా ట్యాప్ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ సీరియస్ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకొస్తాయనేది ఉత్కంఠగా మారింది.

News March 29, 2024

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలంటూ మరో పిల్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆయనను సీఎంగా తొలగించాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిల్ వేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఈ తరహా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేమంటూ తీర్పిచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

News March 29, 2024

ఈ ఆదివారం వారికి సెలవు లేదు

image

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఈ ఆదివారం బ్యాంకు ఉద్యోగులకు సెలవు లేదు. దీంతో మార్చి 31న దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయనున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్స్‌కు ఆటంకం లేకుండా ఆర్బీఐ ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించనున్నాయి.