India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈడీని BJP పొలిటికల్ వెపన్‌లా వాడుకుంటోందని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలని BJP అనుకుంటోంది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఆయన వాడిన ఫోన్ తమకు లభించలేదని ఈడీ గతంలో చెప్పింది. ఇప్పుడేమో ఆయన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పట్లేదని అంటోంది. ఫోన్‌లోని వివరాల కోసం కస్టడీని పొడిగించాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకునేందుకే ఇలా చేస్తోంది’ అని అన్నారు.
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1700కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులను ఐటీ శాఖ పంపించింది. రీఅసెస్‌మెంట్‌ను నిలిపివేయాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా ఈ చర్యను కాంగ్రెస్ తప్పుపట్టింది. మరోవైపు ఇప్పటికే IT శాఖ రూ.135కోట్లను రికవరీ చేసింది.
IPL-2024లో ఇప్పటివరకు 9 మ్యాచులు జరగగా ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయలేదు. 170 సిక్సులు, 259 ఫోర్లు, 14 హాఫ్ సెంచరీలు, ఐదుసార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. IPL చరిత్రలో అత్యధిక స్కోర్(277) రికార్డు కూడా నమోదైంది. ప్రస్తుతానికి క్లాసెన్(143) టాప్ స్కోరర్‌గా, ముస్తాఫిజుర్(6) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నారు. మరి ఈ సీజన్‌లో తొలి సెంచరీ ఏ బ్యాటర్ చేస్తాడని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తాను ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడంతో ఓడిపోయానని ఆమె తెలిపారు. డబ్బులు లేకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదన్న మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు.
AP: కూటమిలో భాగంగా సీట్ల కేటాయింపులతో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నవారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తితో ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ‘చాయ్ పే చర్చ’లో డీప్‌ఫేక్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చని.. కొందరు తన గొంతును అనుకరించారని చెప్పారు. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో వెళ్తుందన్నారు. AIతో తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్లు గుర్తు చేశారు. ఏఐ శక్తిమంతమే అయినా.. దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, యాడ్స్ ఇలా నానా హంగామా ఉంటుంది. మరి ఇంతకీ అభ్యర్థులు అధికారికంగా ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? లోక్‌సభ ఎన్నికలకు అయితే రూ.95లక్షలు, అసెంబ్లీ పోల్స్‌కు అయితే రూ.40లక్షలు. కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే లోక్‌సభకు రూ.75లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా లిమిట్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
2019 ఎన్నికల సమయంలో లోక్‌సభకు లిమిట్ రూ.70లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా ఉండేది. దేశ తొలి జనరల్ ఎలక్షన్‌లో (1951-52) లోక్‌సభకు రూ.25వేలు లిమిట్ ఉండేది. పలు ఈశాన్య రాష్ట్రాలకు ఇది రూ.10వేలుగా ఉండేది. 1971లో ఈ లిమిట్‌ను రూ.35వేలు చేశారు. ఇక 1980లో ఆ లిమిట్ రూ.లక్షకు, 1998లో రూ.15లక్షలకు, 2004లో రూ.25లక్షలకు, 2014లో రూ.70లక్షలకు పెరిగింది.
<<-se>>#Elections2024<<>>
ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను కాదని హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొందరు పాండ్య భార్యను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నటాషా సోషల్ మీడియా పోస్టులపై పాండ్యను ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా కుటుంబ సభ్యులను విమర్శించడం సరికాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
*156- క్రిస్ గేల్
*113- రోహిత్ శర్మ
*112- డేవిడ్ వార్నర్
*110- షేన్ వాట్సన్
*110- రాబిన్ ఉతప్ప
*109- యూసుఫ్ పఠాన్
*108- విరాట్ కోహ్లీ
*104- కీరన్ పొలార్డ్
*100- ధోనీ
Sorry, no posts matched your criteria.