India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గురువులు పాఠాలు, గుణపాఠాలు, జీవిత పాఠాలు బోధిస్తారు. ఆటలు, పాటలతో పాటు పోరాటాలు చేయడమూ నేర్పిస్తారు. అజ్ఞానం తొలగించి జ్ఞానాన్నిస్తారు. టాలెంట్‌ను గుర్తించి శిక్షణనిస్తారు, తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితేనేం తమ శిష్యులను ఉన్నత శిఖరాలకు చేరుస్తారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహిస్తారు. అందుకే మంచి గురువులున్నవారి బతుకు, భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది.
✒ గురువులందరికీ HAPPY TEACHERS DAY
TG: గ్రూప్-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022 DECలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
తెలంగాణలో సంభవించిన ప్రకృతి విపత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులపై రోజూవారీ నివేదిక పంపేలా అధికారులను ఆదేశించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)కి లేఖ రాసింది. రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి టెలిఫోన్ ద్వారా అందిన సమాచారం ప్రకారం ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన సామగ్రిని పంపించామని పేర్కొంది.
AP: పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1 RD(రిజిస్టర్డ్) ఫింగర్‌ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ₹53 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో OCT నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న L0 RD డివైజ్‌లలో సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.
AP: వర్షాలు తగ్గినా వరదలు కొనసాగుతుండటంతో కలెక్టర్లు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోనూ వరద ముప్పు ఉండటంతో సెలవు ఇస్తే బాగుంటుందని పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.
TG: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 103 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ నుంచి 11, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది ఉన్నారు. ఎంపికైన వారిని నేడు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పురస్కారాలతో పాటు రూ.10వేల నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈనెల 11న పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు KCR సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కష్టాలు, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ నిరసనలు, రోడ్ షోలు చేపట్టనున్నట్లు సమాచారం.
AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
AP: వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కొందరు బయట పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏలూరు రోడ్డులో గూడవల్లి ఫ్లై ఓవర్ పైనుంచి ఆహారాన్ని పడేస్తున్న ఫొటోలను ఓ నెటిజన్ Xలో పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం, పోలీసులను కోరారు. అయితే అది పాడైపోయిన ఆహారం కావొచ్చని, తెల్లవారుజామున పంపిన ఫుడ్ మధ్యాహ్నంకల్లా పాడైపోతోందని, ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి 3 రోజులుగా కరెంటు లేదంటూ కొందరు చెబుతున్నారు.
TG: రాష్ట్రంలో వరదలకు భారీ వర్షాలతో పాటు కబ్జాలు కూడా కారణమని మంత్రి సీతక్క అన్నారు. అన్ని గ్రామాల్లో చెరువులు, వాగులు, కుంటలు, ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ఐదుగురు అధికారులతో వరద నిర్వహణ కమిటీలను నియమించాలన్నారు. రాష్ట్రంలోని పల్లె రహదారుల పునరుద్ధరణ కోసం రూ.24కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.