India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లైనెన్స్‌డ్ ఆయుధాలను పోలీసులు స్వాధీనపరచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మణిపుర్‌లోని కుకీ-జో పౌరసమాజ సంస్థ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. స్థానికంగా మైతీలతో తమకున్న ఉద్రిక్తతల కారణంగా తుపాకులు ఇవ్వడం కుదరదని తెగేసి చెబుతోంది. మణిపుర్ హింస సమయంలో 4వేలకు పైగా తుపాకుల్ని పోలీసుల వద్ద నుంచి దుండగులు తస్కరించిన సంగతి తెలిసిందే.
TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న కాంగ్రెస్ ‘జనజాతర’ సభ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇచ్చే గ్యారంటీ హామీలను ఈ సభలోనే ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సభకు హాజరై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
TG: గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సా.5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. 563 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుంది. వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
AP: బీసీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. జగన్ రాజకీయ నాయకుడు కాదని, ఒక సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. బీసీలను గత ప్రభుత్వం ఓటుబ్యాంకుగా మాత్రమే చూసిందని, జగన్ మాత్రం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని తెలిపారు. 11 ఎంపీ, 58 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అంబేడ్కర్ ఆలోచనావిధానంతో జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు.
అభ్యర్థుల ఎంపికలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే ఫైనల్ అని ఆ పార్టీ అగ్రనేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘అభ్యర్థుల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించాకే పవన్ ఓ నిర్ణయానికి వస్తారు. ఈ సంగతి కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తాం. క్రమశిక్షణ చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,30,13,318గా ఉందని చెప్పారు. కొత్త ఓటు నమోదుతో పాటు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని తెలిపారు.
IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో SRH, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడంతో.. ఇవాళ గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.
TS: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, ఎర్రబెల్లిని అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘మునుగోడులో రాజగోపాల్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం. ట్యాపింగ్ తొలి బాధితుడు సీఎం రేవంత్. రెండో బాధితుడిని నేనే. హైకోర్టు జడ్జిలు, హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఈ కేసులో కేసీఆర్‌ను, హరీశ్‌ను తొలి ఇద్దరు ముద్దాయిలుగా చేర్చాలి. కేసును సీబీఐకి అప్పగించాలి’ అని స్పష్టం చేశారు.
AP: పొత్తు దృష్ట్యా టీడీపీ, జనసేన కొన్ని స్థానాలను వదిలేసుకున్నాయి. ఈ క్రమంలో సీట్లు దక్కని వాటి అసంతృప్తుల్ని తాము చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదని హస్తం వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే జలీల్‌లతో ఆ పార్టీ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
సూర్యుడి నుంచి బయలుదేరిన సౌర తుఫాను నిన్న భూమిని తాకిందని అమెరికాలోని NOAA పరిశోధకులు వెల్లడించారు. గత ఆరేళ్లలో ఇదే అత్యంత శక్తిమంతమైనదని, దీని కారణంగా భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిందని వివరించారు. కాగా.. చరిత్రలో అతి పెద్ద సౌర తుఫాను 1859లో వచ్చింది. ఆ సమయంలో దానివలన టెలిగ్రాఫ్ సేవలకు అంతరాయం కలిగింది. 2011 ఫిబ్రవరిలో వచ్చిన సౌర తుఫాను జీపీఎస్ సంకేతాలకు స్వల్ప అంతరాయం కలిగించింది.
Sorry, no posts matched your criteria.