India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ కొరియాలో డీప్‌ఫేక్ పోర్న్ వీడియోల సంక్షోభం నెలకొంది. వేలమంది చిన్నారులు, యువతులు బాధితులుగా మారుతున్నారు. తమ ముఖాలతో టెలిగ్రామ్ ఛానళ్లలో వీడియోలు వైరల్ అవుతుండటంతో టీచర్లు, స్టూడెంట్స్, సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ డిజిటల్ సెక్స్ క్రైమ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశాధ్యక్షుడు యూన్ సుక్ అధికారుల్ని ఆదేశించారు. సెలబ్రిటీలపై కోపంతో వారి డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారనీ తెలిసింది.
నిరుద్యోగ తీవ్రతను తెలిపే ఘటన హరియాణాలో జరిగింది. ₹15వేల జీతంతో పలు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా 6000 మంది PG, 40,000 మంది డిగ్రీ అభ్యర్థులు, 12 వరకు చదివిన 1.2లక్షల మంది అప్లై చేశారు. స్వీపర్‌గా చేరితే భవిష్యత్తులో ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని కొందరంటే, ఆర్థిక సమస్యలతో దరఖాస్తు చేసుకున్నట్లు మరికొందరు చెప్పారు. ప్రైవేటులో జీతం ₹10K ఇస్తున్నారని, ఇక్కడైతే ₹15K అని ఇంకొందరన్నారు.
AP: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ, శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి, మందులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా లోక్‌సభా విపక్షనేత రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారని తెలుస్తోంది. టికెట్ల కోసమే వారిద్దరూ రాహుల్‌ను కలిశారని ఇంగ్లిష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేత దీపేంద్ర హుడాతో వీరిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ₹2కోట్లు విరాళం ఇచ్చిన నారా <<14015209>>భువనేశ్వరికి<<>> CM చంద్రబాబు థాంక్స్ చెప్పారు. ‘వినాశకరమైన వరదల దృష్ట్యా AP, TG CMRFలకు చెరో రూ.కోటి విరాళమిచ్చిన నారా భువనేశ్వరి నేతృత్వంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన అనేక మందికి కృతజ్ఞతలు. ఈ కష్ట సమయాల్లో, ఇలాంటి చర్యలు మానవత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి’ అని ట్వీట్ చేశారు.
AP: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో YCP నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. TDP ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి, అవినాశ్, తలశిల రఘురాం, నందిగామ సురేశ్, జోగి రమేశ్, CBN నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితులుగా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు నుంచి మినహాయించాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరగా మధ్యాహ్నం నిర్ణయాన్ని వెల్లడించనుంది.
AP: కరకట్ట సేఫ్టీ కోసమే బుడమేరు గేట్లు తెరిచారని కొందరు ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. ‘వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే, ప్రభుత్వం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే, సైకో జగన్ వికృతానందం చూడండి. బంగ్లాదేశ్ వరదల ఫోటోతో విజయవాడ వరదలు అంటూ ఫేక్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌పై గుర్తుండిపోయే టెస్టు సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఆ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. దీంతో ఈ విజయం బంగ్లాదేశ్‌కు ఎంత విలువైందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్‌ఉన్ 20-30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించారని ద.కొరియా మీడియా వెల్లడించింది. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్ వరదల్లో ప్రజలు చనిపోకుండా వారు కాపాడలేకపోవడమే ఇందుకు కారణం. జులైలో సంభవించిన ఈ విపత్తులో 1000+ మంది చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు, 7410 ఎకరాల వ్యవసాయభూమి, రోడ్లు, కట్టడాలు నీట మునిగాయని సమాచారం.
AP: విజయవాడలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో నెలలు నిండిన గర్భిణులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వరద చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఓ గర్భిణి వరద ప్రవాహంలోనే కష్టంగా నడుస్తున్న ఓ ఫొటో గుండెల్ని పిండేస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్లలో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు, 10 రోజుల్లో డెలివరీ అయ్యే 154 మందిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.