news

News September 4, 2024

డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం.. షెడ్యూల్ విడుదల

image

TG: డిగ్రీ ఫస్టియర్‌లో ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. ₹400తో ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 11న సీట్ల కేటాయింపు, 11-13 వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్‌ జరగనుంది.

News September 4, 2024

తెలుగు రాష్ట్రాలకు రూ.2కోట్ల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి

image

వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్‌పర్సన్ నారా భువనేశ్వరి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

News September 4, 2024

ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు: CM

image

AP: ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని CM CBN తెలిపారు. ‘బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తాం. వాగు నీరు నేరుగా కృష్ణా నదికి వచ్చేలా ఉండే అడ్డంకులు తొలగిస్తాం. విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతాం. గోదావరి వరదను పర్యవేక్షిస్తున్నాం. ఇంటింటికి ఆహారం సరఫరా చేస్తాం. పశువులకు దాణా అందిస్తాం. అస్నా తుఫాను ఇటు రాదంటున్నారు. అయినా అలర్ట్‌గా ఉంటాం’ అని చెప్పారు.

News September 4, 2024

నిద్రను త్యాగం చేసి ఉద్యోగం చేస్తున్నారా?

image

వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను అర్థం చేసుకోకుండా చాలా మంది తమ సమయాన్ని ఉద్యోగం కోసమే త్యాగం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన యువ పారిశ్రామికవేత్త కృతార్థ్ మిట్టల్ నిద్ర పోకుండా, ఆహారం తీసుకోకుండా పనిచేసి కెరీర్‌లో సక్సెస్ అయ్యారు. కానీ 25 ఏళ్లకే వివిధ ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. 5 గంటల కంటే తక్కువ నిద్రపోయి డైట్ పాటించకపోవడంతో ఇలా జరిగిందని, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.

News September 4, 2024

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో 5 మెడల్స్

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ మరో 5 పతకాలు గెలిచింది. దీంతో ఇప్పటివరకు గెలిచిన మెడల్స్ సంఖ్య 20కి చేరింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని మెడల్స్ సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా జరిగిన పోటీల్లో స్ప్రింటర్ దీప్తి జీవన్‌జీ కాంస్యం, మెన్స్ హై జంప్ t63 ఈవెంట్‌లో శరద్ సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలిచారు. మెన్స్ జావెలిన్ త్రో f46 ఈవెంట్‌లో అజీత్ సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు.

News September 4, 2024

ఇండియాVSమారిషస్‌ మ్యాచ్ డ్రా.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో ఇండియా, మారిషస్ తలపడగా, ఏ జట్టూ గోల్ చేయకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో మూడు జట్ల మధ్య 3 మ్యాచులు (రౌండ్ రాబిన్ ఫార్మాట్) జరగనుండగా, సెప్టెంబర్ 6న మారిషస్VSసిరియా, 9న ఇండియాVSసిరియా మ్యాచులు జరగనున్నాయి.

News September 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 04, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:49 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు
అసర్: సాయంత్రం 4:40 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:27 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 4, 2024

సెప్టెంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

1825: విద్యావేత్త, జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం
1935: తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం
1962: భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్ స్మిత జననం
1987: బాలీవుడ్ సింగర్ రితు పాతక్ జననం
1999: ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం

News September 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.