news

News September 3, 2024

BREAKING: కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు

image

TG: విద్యా రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో దీనిని ఏర్పాటు చేసింది. త్వరలో వీరిని నియమించనుంది. ఈ కమిషన్‌కు రెండేళ్లు కాలపరిమితిగా నిర్ణయించింది.

News September 3, 2024

వరద బాధితులకు YCP రూ.కోటి సాయం

image

AP: వరద బాధితులకు YCP తరఫున రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసే ఈ సాయం ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ‘వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి నెలకొంది. అధికారులందరూ సీఎం చుట్టు తిరుగుతూ సమస్యలను గాలికొదిలేశారు’ అని ఆయన మండిపడ్డారు.

News September 3, 2024

సహాయక చర్యల్లో ట్రైనీ కానిస్టేబుల్స్ పనితీరు అభినందనీయం: DGP

image

TG: ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో కీలకంగా వ్యవహరించిన 525 మంది ట్రైనీ కానిస్టేబుల్స్‌ను డీజీపీ జితేందర్ అభినందించారు. ‘ఖమ్మం సీపీ సునీల్ దత్‌కు అభినందనలు. వరద సహాయక చర్యలలో 525 మంది ట్రైనీ కానిస్టేబుల్స్ అంకితభావంతో వేగంగా పనిచేశారు. ఖమ్మం వరద బాధిత ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం వారు చూపిన నిబద్ధత సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది’ అని డీజీపీ ట్వీట్ చేశారు.

News September 3, 2024

వినాయక చవితికి మోక్షజ్ఞ మూవీ షురూ?

image

వినాయక చవితి రోజున నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆ రోజు జరుగుతాయని సమాచారం. ఈ మూవీని సూపర్ హీరోల సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్షజ్ఞ సోదరి తేజస్విని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

News September 3, 2024

పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే?

image

APలో వరద పరిస్థితులు నెలకొంటే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ‘పవన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలు పరిశీలిస్తున్నారు. తన శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి 6 గంటలకు అన్ని జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు’ అని పవన్ చేపట్టిన పనుల వివరాలు పంచుకుంది.

News September 3, 2024

బ్రూనై రాజు విలాసాలు.. హెయిర్ కట్‌కు రూ.16.5 లక్షలు

image

PM మోదీ నేడు బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఆ దేశ రాజు హస్సనల్ బోల్కియా ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఎక్కువ కాలం పాలించిన రెండో వ్యక్తి. ఆస్తి $30 బిలియన్లపైనే ఉంటుంది. 1700 గదులున్న ఆయన ప్యాలెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌గా పేరొందింది. హెయిర్ కట్ కోసం ప్రైవేటు జెట్‌లో లండన్‌లో ఉన్న బార్బర్ దగ్గరకు వెళతారు. ఇందుకోసం $20వేలు(₹16.5 లక్షలు) వెచ్చిస్తారు.

News September 3, 2024

IC-814 వివాదంపై Netflix India Update

image

‘IC-814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్‌ పేర్ల వివాదంపై Netflix India స్పందించింది. ఈ సిరీస్ ప్రారంభ డిస్‌క్లైమ‌ర్‌లో హైజాకర్ల నిజమైన పేర్ల‌తోపాటు వారు ఉప‌యోగించిన‌ కోడ్ పేర్లను అప్‌డేట్ చేసినట్టు తెలిపింది. వాస్త‌వానికి ఈ హైజాక్ ఉదంతం జ‌రిగిన అనంత‌రం కేంద్ర హోం శాఖ అప్ప‌ట్లో విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఉగ్ర‌వాదులు భోలా, శంక‌ర్, చీఫ్, డాక్టర్, బర్గర్ అనే పేర్ల‌ను కోడ్ భాష‌గా వాడిన‌ట్టు వెల్ల‌డించింది.

News September 3, 2024

కాంగ్రెస్ గూండాల దాడి బాధాకరం: పువ్వాడ

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల <<14010859>>దాడి<<>> బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు తాము భయపడబోమన్నారు. వరద బాధితులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతిపక్షంగా పోరాడే బాధ్యత తమపై ఉందని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వాహనంపై దాడిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఇలాంటి దాడులను తాము ప్రోత్సహించమని చెప్పారు.

News September 3, 2024

భార‌త వృద్ధి అంచ‌నాల‌ను పెంచిన ప్ర‌పంచ బ్యాంక్‌

image

FY25కి భార‌త వృద్ధి అంచ‌నాల‌ను ప్ర‌పంచ బ్యాంకు 6.6% నుంచి 7 శాతానికి పెంచింది. దేశీయంగా ఉత్పత్తి, మెరుగైన ఎగుమతులు వంటి అంశాలతో దేశ ఆర్థిక పనితీరుపై ప్ర‌పంచ బ్యాంకు పాజిటివ్‌గా ఉంది. FY23-24లో 8.2 శాతం వేగంగా వృద్ధి చెందిందని, ప్రజా మౌలిక సదుపాయాలు, గృహ పెట్టుబడుల పెరుగుదల దీనికి కారణంగా నివేదిక పేర్కొంది. మ‌హిళా ఉద్యోగులు గ‌ణ‌నీయంగా పెరిగినా, అర్బ‌న్ యూత్‌ అన్ఎంప్లాయిమెంట్‌ 17 శాతంగా ఉంది.

News September 3, 2024

పవన్.. చేతకాకపోతే తప్పుకో: కేఏ పాల్

image

AP: వరద బాధితులకు సహాయం చేయడం చేతకాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి నుంచి తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన బాధితులకు ఆహార పొట్లాలు అందించారు. ‘వరదల ధాటికి విజయవాడలో 2,300 మంది మరణించారు. ఒక్కో మృతుడికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలి. సీఎం చంద్రబాబు, పవన్ కలిసి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల సాయం తీసుకురావాలి’ అని ఆయన పేర్కొన్నారు.