news

News May 9, 2024

మేమూ హిందువులమే.. కానీ.. : పద్మారావు

image

TG: తామూ హిందువులమేనని, కానీ.. రాముడి పేరుతో రాజకీయాలు చేయబోమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. బీజేపీలా రాముడి పేరుతో ఓట్లు అడుక్కోనని చెప్పుకొచ్చారు. ఆ పార్టీ ఇంకెన్ని రోజులు రాముడి పేరుతో ఓట్లు అడుక్కుంటుందని ఆయన ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్నందుకే కవితను జైలుకు పంపించారని ఆయన అన్నారు.

News May 9, 2024

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News May 9, 2024

శ్రీలంక టీ20WC జట్టు ఇదే..

image

టీ20 WC కోసం శ్రీలంక 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా హసరంగ, వైస్ కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నారు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో నలుగురు చోటు దక్కించుకున్నారు.
జట్టు: హసరంగ(C), అసలంక(VC), కుశాల్ మెండిస్, నిస్సాంక, కమిందు మెండిస్, సమరవిక్రమ, మాథ్యూస్, శనక, ధనంజయ డిసిల్వా, మహీశ తీక్షణ, దునిత్ వెల్లెలెగ, చమీరా, పతిరణ, తుషారా, మధుశంక.

News May 9, 2024

‘క్విక్‌’గా లాభాలు ఆర్జించాలని..!

image

దేశంలో క్విక్ కామర్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉబర్ సైతం ఉబర్ పికప్ సర్వీస్‌ను విస్తరించడంపై దృష్టి సారించింది. కిరాణ, మందులు తదితర సామగ్రిని ఇంటికి చేరవేసే ఈ సర్వీస్‌ను ఇప్పటికే హైదరాబాద్, చెన్నై సహా తొమ్మిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు స్విగ్గీ సైతం గతంలో తెచ్చిన హోమ్‌స్టైల్ ఫుడ్ సర్వీస్‌ ‘డైలీ’ని పునఃప్రారంభించింది. 2019లో ‘డైలీ’ లాంచ్ కాగా 2020లో కరోనా కారణంగా మూతపడింది.

News May 9, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు పోటెత్తారు

image

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు పోటెత్తారు. గతంలో లేని విధంగా ఈసారి రెట్టింపు స్థాయిలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నేటితో ఈ ప్రక్రియ ముగిసింది. 2019లో 2.38 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో ఫలితాలు వచ్చాకే తెలియనుంది.

News May 9, 2024

మంగళగిరికి పరిశ్రమలు తీసుకొస్తా: లోకేశ్

image

AP: మంగళగిరి ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ‘ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తా. దేశంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మంగళగిరిని మారుస్తా. ఓటు వేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం జగన్, వైసీపీ నేతల మాటలు నమ్మొద్దు. ప్రతి హామీనీ నెరవేర్చే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటా’ అని వెల్లడించారు.

News May 9, 2024

అందుకే నాకు హిందీ ఆఫర్లు రాలేదు: జ్యోతిక

image

తాను సౌత్ ఇండియన్ అనుకుని హిందీ ఫిల్మ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వలేదని నటి జ్యోతిక తెలిపారు. బాలీవుడ్‌లోనే కెరీర్ ప్రారంభించినా ఆఫర్లు రాలేదన్నారు. అటు సౌత్‌లో కొన్ని మూవీలు ఫ్లాపైనా నటనను మెచ్చి ఇక్కడ ఛాన్సులు ఇచ్చారని చెప్పారు. ముంబైకి చెందిన జ్యోతిక తొలి మూవీ ‘డోలీ సజా రఖ్‌నా’ (1998). 2024లో ‘సైతాన్’తో బ్లాక్‌బస్టర్ బీటౌన్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె లేటెస్ట్ మూవీ ‘శ్రీకాంత్’ ఈనెల 10న రిలీజ్ కానుంది.

News May 9, 2024

రేపు ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం

image

AP: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జోరు పెంచారు. రేపు ఒక్కరోజే ఐదు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలులో ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. చివరి రోజైన శనివారం 3 సభల్లో పాల్గొననున్నారు. కాగా అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది.

News May 9, 2024

అప్పుడు పద్మభూషణుడు.. ఇప్పుడు పద్మవిభూషణుడు

image

మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే.. ఆయనకు ఇది రెండో పద్మ అవార్డు. 2006లోనే ఆయన పద్మభూషణ్ అందుకున్నారు. ఇక చిన్నాచితకా అవార్డులైతే కోకొల్లలు. సినిమాలతో పాటు ఆయన బ్లడ్ బ్యాంక్‌తో ఏటా వేలాది మందిని ఆదుకుంటున్నారు. కరోనా సమయంలోనూ CCCని స్థాపించి ఇండస్ట్రీలోని పేదలకు సాయం చేశారు. ఎవరైనా సమస్యతో తన దగ్గరకు వస్తే ఆదుకునేందుకు ముందుంటారు మెగాస్టార్.

News May 9, 2024

మహిళల ఖాతాల్లో ఏటా ₹లక్ష జమ: రాహుల్

image

దేశంలో రెండు సమూహాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు BJP, RSS ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత తెలిపారు. దేశంలో పేదల జాబితా తయారుచేసి ప్రతి పేద ఇంట్లోని ఓ మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు ₹8,500 వేస్తామన్నారు.