India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే స్వయంగా ప్రకటించారు. ‘దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రుతి. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుండగా, శ్రుతి రెండో హీరోయిన్. ఎన్టీఆర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తారని టాక్.
ఇటీవల ఇండియాపై విషం కక్కుతున్న మాల్దీవ్స్ దారికొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు తాజాగా ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని అభివర్ణించారు. అంతేకాదు.. ఇటీవల మాల్దీవ్స్ నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన ముయిజ్జు ఇప్పుడు భారత్ నుంచి రుణ విముక్తి కోరుతున్నారు. మాల్దీవ్స్‌కు సహాయం అందించడంలో భారత్ ముందుంటుందని కొనియాడారు.
AP: పల్నాడు(D) నరసరావుపేటలో మరోసారి ఆసక్తికర పోరు జరగనుంది. TDP నుంచి చదలవాడ అరవింద బాబు, YCP తరఫున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. వృత్తి రీత్యా వీరిద్దరూ ఎముకలు, కీళ్లకు సంబంధించిన సీనియర్ వైద్యులు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో సొంత హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గోపిరెడ్డికి లక్ష ఓట్లు రాగా, చదలవాడకు 68 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
తగిన చర్యలు తీసుకోకుంటే ఇతర ప్రాంతాలకూ బెంగళూరు తరహాలో నీటి ఎద్దడి తప్పవంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38% మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, MP, త్రిపుర, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, UP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు నేరం రుజువైతే జైలు శిక్ష పడవచ్చు. అయితే.. ఆయన జైలు నుంచే రాష్ట్రాన్ని నడిపిస్తారని AAP నేతలు చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా? అంటే.. సాధ్యమే. కేజ్రీవాల్‌కు జైలు శిక్ష పడినా కారాగారం నుంచే ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. జైలు నుంచి CMగా పని చేయవద్దనే నిబంధనలు రాజ్యాంగంలో లేవు. 2ఏళ్ల జైలు శిక్ష పడితే మాత్రం ఆయన పదవి కోల్పోతారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవికి పురందీశ్వరి రాజీనామా చేశారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ BJP స్పందించింది. ‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్. ఎన్డీయే కూటమి వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని గమనించగలరు’ అని ట్వీట్ చేసింది. కాగా, విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో రాజీనామా చేస్తున్నానని పురందీశ్వరి పేరిట ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు కస్టడీ విధించడం సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అయిన ఆయనను అరెస్ట్ చేయడంపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో అరెస్టును ఖండించాయి. ఇప్పుడు ఏకంగా కస్టడీకి ఇవ్వడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే జైలులో ఉన్న కవిత, మనీశ్ సిసోడియాతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించొచ్చు.
CSKతో జరుగుతున్న ఆరంభ మ్యాచులో RCBకి బిగ్ షాక్ తగిలింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ విజృంభించి ఏకంగా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో RCB 12 ఓవర్లకే 78 పరుగులకు 5 కీలక వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్ (35), కోహ్లీ(21), గ్రీన్(18), రజత్ పాటీదార్, మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యారు.
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని కర్ణాటక ఎన్నికల కమిషన్‌ను BJP ఆశ్రయించింది. ఆయన సతీమణి గీత శివమొగ్గలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఆయన సినిమాలు, ప్రకటనలను ప్రసారం చేయకుండా థియేటర్లు, టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించాలని కోరింది. BJP వినతిని పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఈవో తెలిపారు.
IPL-2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైతో తొలి మ్యాచులో RCB టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి ఇది 250వ IPL మ్యాచ్. ఎమ్మెస్ ధోనీ చెన్నై తొలి మ్యాచుతో పాటు 50, 100, 150, 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. కానీ ఈసారి అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 250వ మ్యాచులో రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.