news

News May 9, 2024

SBI లాభం రూ.21,384 కోట్లు

image

2023-24 మార్చి త్రైమాసికంలో ₹21,384 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసినట్లు SBI వెల్లడించింది. 2022-23 ఇదే సమయంతో పోల్చితే 18.18% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. పూర్తి ఆదాయం ₹1.06 లక్షల కోట్ల నుంచి ₹1.28 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. డిసెంబర్ క్వార్టర్‌లో PNB ₹1,159 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, మార్చిలో ఆ మొత్తం ₹3,010 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం ₹27,269 కోట్ల నుంచి ₹32,361 కోట్లకు పెరిగింది.

News May 9, 2024

వంట వాసనతోనూ వాయు కాలుష్యం!

image

ఎక్కడైనా వంట చేస్తుంటే వాసన పీల్చి ఆహా అనుకుంటాం. ఇకపై అలాంటి స్మెల్‌కు జాగ్రత్త పడాల్సిందే. ఆహారం వండినప్పుడు వచ్చే వాసన గాలి కాలుష్యానికి కారణమవుతోందని NOAA వెల్లడించింది. USలోని 3 ప్రధాన నగరాల్లో వంట సమయంలో అస్థిర కర్బన సమ్మేళనాల(VOC)ను గుర్తించినట్లు తెలిపింది. వెహికల్స్, అడవుల్లో కార్చిచ్చు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా వచ్చే మొత్తం VOCల్లో 21% వంటకు సంబంధించింనవేనని పేర్కొంది.

News May 9, 2024

రాహుల్‌కు ధోనీ పరిస్థితేనా?

image

కేఎల్ రాహుల్ పట్ల సంజీవ్ గోయెంకా వ్యవహరించిన <<13210793>>తీరు<<>> చర్చనీయాంశంగా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్లతో గోయెంకా ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో పుణే వారియర్స్‌కి ఓనర్‌గా ఉన్న ఆయన ధోనీనే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ‘యువ కెప్టెన్ అవసరమనుకున్నాం. అందుకే ఈ నిర్ణయం’ అంటూ అప్పట్లో గోయెంకా సమాధానమిచ్చారు. దీంతో ఇప్పుడు రాహుల్‌కు అదే పరిస్థితి రావొచ్చంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 9, 2024

ఆర్థిక, రాజకీయ భీష్ముడు రోశయ్య

image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న రాజకీయ భీష్ముడు కొణిజేటి రోశయ్య. కంచుకంఠంతో చమక్కులు.. చురుక్కులు విసురుతూ చట్టసభలో విపక్షాల విమర్శలను విరిచేసేవారు. 1968లో MLCగా చట్టసభలో అడుగుపెట్టిన ఆయన.. తర్వాత MLA, MPగాను గెలుపొందారు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయన సొంతం. YS మరణానంతరం CMగా 14నెలలు కొనసాగారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 9, 2024

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

image

ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని నాంపల్లి కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీఎం జగన్ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతున్నందున ఆయనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. కాగా దీనిపై విచారణను మే 14కు కోర్టు వాయిదా వేసింది.

News May 9, 2024

‘కన్నప్ప’ సెట్లో ప్రభాస్

image

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ మూవీలో అనేకమంది స్టార్ నటులు అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ పాత్ర షూటింగ్ పూర్తవ్వగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ‘కన్నప్ప’ సెట్లో అడుగు పెట్టారు. ‘మా బ్రదర్ షూటింగ్‌లో పాల్గొన్నారు’ అంటూ మంచు విష్ణు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

News May 9, 2024

నా లాంటి ఇంజినీర్‌కు ఇస్తే పోలవరం రెండేళ్లలో పూర్తయ్యేది: సుజనా

image

AP: రాష్ట్రానికి BJP ఎంతో చేసినా ఏ రోజూ చెప్పుకోలేదని విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. ‘22 మంది YCP MPలు ఉన్నా రాష్ట్ర అభివృద్ధి గురించి లోక్‌సభలో మాట్లాడలేదు. పోలవరం 2019 నాటికి 79% పూర్తయ్యింది. నా లాంటి ఇంజినీర్‌కు అప్పగిస్తే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేది. చంద్రబాబు CM అయినా అది ముళ్ల కిరీటమే. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్నీ ఓవర్‌నైట్ చేసేయలేం’ అని పేర్కొన్నారు.

News May 9, 2024

తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు: SCR

image

ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశమున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నడిచే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో పార్లమెంటు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

News May 9, 2024

18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

image

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(ఆగస్టు నెల కోటా)ను ఈ నెల 18న ఉ.10 గంటలకు <>ఆన్‌లైన్‌లో<<>> విడుదల చేయనున్నట్లు TTD వెల్లడించింది. 20వ తేదీ ఉ.10 గంటల వరకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే రోజు మ.12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లను మంజూరు చేస్తామంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ తదితర సేవా టికెట్లు, అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, రూ.300 దర్శన కోటా టికెట్ల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.

News May 9, 2024

జపాన్‌లో పెరుగుతున్న ఖాళీ ఇళ్లు!

image

జపాన్‌లో ఖాళీ ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం 90లక్షల ఇళ్లు అంటే మొత్తం ఇళ్లలో 14శాతం ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనాభా తగ్గడం, ఇళ్లు ఇచ్చేందుకు వారసులు లేకపోవడం, చాలామంది పట్టణాల్లో స్థిరపడటం వంటి కారణాలతో గ్రామాల్లో ఉన్న ఇళ్లు ఖాళీగా మారుతున్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే కొందరు విదేశీయులు ఈ ఇళ్లను కొనుక్కొని గెస్ట్ హౌస్‌లుగా మార్చుకుంటున్నారు.