India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలవాలని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఆకాంక్షించారు. ‘మాలో ఒకడు.. మనలో ఒకడు.. మనిషితనానికి ప్రతీక.. మంచి ఆలోచనలున్న నేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో బలిష్ఠమైన మెజారిటీతో గెలుపొందాలని ఆ శ్రీపాదశ్రీవల్లభుడిని ప్రార్థిస్తున్నా. పరిశ్రమలో ఒకడిగా వారి తరఫున పిఠాపురం ప్రజల మద్దతునర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
AP: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి 4.32 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. నేటితో ఈ ప్రక్రియ ముగియనుండగా ఆ సంఖ్య మరింత పెరగనుంది. ఉద్యోగులు ఇంత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటుండటం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారు ప్రభుత్వంపై కోపంతో వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని విపక్షాలు అంటుండగా.. తాము చేసిన మంచిని చూసి తమకే ఓటేస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది.
AP: నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమా విడుదలను నిలిపివేయాలని వైసీపీ ఈసీని కోరింది. ఈ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆ పార్టీ గ్రీవెన్స్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందని వారు అన్నారు. కాగా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ కానుంది.
TG: మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డను నిర్మించిన L&T సంస్థ ఆ రాష్ట్రంలో ఓ డ్యాం నిర్మాణానికి వేసిన టెండర్‌లో తాము చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కడా వైఫల్యం చెందలేదని పేర్కొంది. అందులో మేడిగడ్డ గురించీ ప్రస్తావించింది. దీంతో మేడిగడ్డ వైఫల్యానికి L&T కారణమా లేక ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది చెప్పాలని ఉత్తరాఖండ్ కోరింది.
TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత KCR చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు సిద్దిపేటలో జరిగే సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు. 16 రోజులపాటు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో KCR బస్సు యాత్ర కొనసాగింది. నేడు సిరిసిల్లలో జరిగే రోడ్ షో, సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.
AP: విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. రేపటి నుంచి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.
TG: రాష్ట్రంలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 2.64 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిన్న 1.76 లక్షల మంది ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80 ఏళ్లు పైబడిన వారిలో 21,651 మంది ఇంటి నుంచే ఓటు వేశారు.
TG: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. రౌస్ అవెన్యూ కోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆమె హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో మూడు రోజులే సమయం ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న మీరు ఊరికి వెళ్లేందుకు ఇప్పటికే రెడీ అయి ఉంటారని ఆశిస్తున్నాం. బస్సు/రైలు టికెట్లు దొరకడం లేదనో, భారీ ఛార్జీలు భరించి ఎవరెళ్తారులే అని ఆగిపోతే ఆగమవుతారు జాగ్రత్త. మే 13.. నీ, నీ ప్రాంతం, రాష్ట్రం భవిష్యత్తుపై నీకున్న బాధ్యత నెరవేర్చాల్సిన, నిరూపించుకోవాల్సిన రోజు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ఓటేద్దామంతే.
<<-se>>#VoteEyyiRaBabu<<>>
టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు కోసం తాను చొరవ తీసుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఈ పొత్తు కోసం ఎంతో నలిగాను. కానీ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత తగ్గాను. కొన్నిసార్లు ఇంత తగ్గకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ప్రజల కోసమే ఆలోచించా’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు, తనకు మధ్య కొన్ని విధానపరమైన విభేదాలు ఉండొచ్చని, వాటిని అధిగమించి అందరం కలిశామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.