India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: లాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రజల్ని భయపెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ‘అసలు వీళ్లు మనుషులేనా? విపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతిచ్చింది. ఇప్పుడు పత్రికల్లో అడ్డగోలు ప్రకటనలు ఇస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ పూర్తయ్యాక భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది. ఈ యాక్ట్ చెత్త అని మోదీ, అమిత్ షాతో చెప్పించగలరా?’ అని ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ భవితవ్యాన్ని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి సంజీవ్ ఖన్నా తేల్చనున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది సంజీవ్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయించనుంది. ED అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇదే బెంచ్ విచారించనుంది. దీంతో సంజీవ్ చేతుల్లోనే AAP, కేజ్రీవాల్ భవిష్యత్తు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా సంజీవ్ తదుపరి CJI అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
AP: తూ.గో జిల్లాలోని రాజమండ్రి రూరల్ TDPకి కంచుకోట. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీ ఈ ప్రాంతంలోనే ఉంది. 2008లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా.. 2009, 14, 19లో టీడీపీనే నెగ్గింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను ఇక్కడ వైసీపీ బరిలోకి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
భారత స్టాక్ మార్కెట్లోని తమ షేర్లను విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఈనెల తొలి ఆరు సెషన్లలోనే ఏకంగా $2.4 బిలియన్లు (రూ.20వేలకోట్లకుపైనే) విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవడమే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. మే 2, 3, 6, 7 తేదీల్లో రూ.6వేల కోట్లకుపైగా విలువైన షేర్లు విక్రయించగా, మే 8న రూ.6,669కోట్లు, మే 9న రూ.6,994కోట్ల షేర్లు విక్రయించారు.
వింటేజ్ పరికరాల ద్వారా ఎలాంటి లాభం లేనప్పటికీ కొందరు ఆసక్తితో సేకరిస్తారు. అయితే, యూకేకి చెందిన రిచర్డ్ వింటర్టన్ అనే వ్యక్తి 1990 నుంచి 2000 మధ్యలో సేకరించిన పోకీమాన్ కార్డ్స్ అతడిని మిలియనీర్‌ను చేశాయి. మొత్తం 2407 కార్డ్స్‌ను వేలంలో ఉంచగా.. జపాన్, చైనా, అమెరికా నుంచి బిడ్డర్స్ ఆసక్తి చూపారు. మొత్తం 21 మంది ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొని 55వేల పౌండ్స్ (రూ.57 లక్షలు)కు వీటిని దక్కించుకున్నారు.
నాగాలాండ్ కోహిమా జిల్లాలోని జఖమా గ్రామంలో మొట్ట మొదటి ‘పొటాటో ఫెస్టివల్’ జరుగుతోంది. సేంద్రీయ బంగాళాదుంప సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ డైరెక్టర్ టెపుటో రిచా తెలిపారు. నాగాలాండ్ జనాభాలో 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటారని చెప్పారు. వ్యవసాయ ఆధారిత సంస్థల స్థాపనను ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ఈ ఫెస్టివల్ కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. రోహిత్, బుమ్రా వంటి సీనియర్లున్న చోట అలాంటి ధోరణి పనికిరాదని హితవు పలికారు. ‘తన కెప్టెన్సీ అలాగే ఉండాలని, ధోనీ మాదిరి చేద్దామని పాండ్య ప్రయత్నిస్తున్నాడు. యువకులు అధికంగా ఉన్న GT టీమ్‌లో ఆ శైలి పనిచేస్తుంది. అత్యంత అనుభవజ్ఞులున్న MIలో అందరూ దాన్ని అంగీకరించరు’ అని ఏబీడీ సూచించారు.
సాధారణంగా పుట్టుకతోనే చెవిటి సమస్య ఉన్నవారు వినికిడి యంత్రాల సాయంతో ఇతరుల మాటలు వింటుంటారు. అయితే మొట్టమొదటిసారి ఒపల్ శాండీ అనే ఓ చిన్నారికి ఓటోఫెర్లిన్ జన్యుచికిత్స ద్వారా పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యను నయం చేశారు UK వైద్యులు. C(2) డొమైన్స్ లోపంతో వినికిడి సమస్య ఎదురైన ఆమెకు క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా అందించిన చికిత్స విజయవంతమైంది. ఇప్పుడు ఆమెకు 18 నెలలు కాగా.. తల్లిదండ్రుల మాటలు వింటోంది.
AP: ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ‘పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిని వెంటాడి కొట్టుకుంటూ తీసుకొస్తా. ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా. 20 రోజులు అదే పనిలో ఉంటా. కేసులతో పాటు జిల్లా బహిష్కరణకు కూడా వెనుకాడం. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలి’ అని ఎస్పీ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని DRDO ఉద్యోగి ప్రవీణ్ మిశ్రా పాకిస్థాన్ మహిళ ‘హనీ ట్రాప్’లో పడి, దేశ సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేశాడు. అతడిని గుజరాత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ISIకి చెందిన సోనాల్ గార్గ్.. తాను IBM ఉద్యోగినని ప్రవీణ్‌కు పరిచయం చేసుకుంది. క్రమంగా అతడితో సన్నిహితంగా మెలిగి కీలక సమాచారాన్ని పొందింది. ప్రవీణ్ ఆఫీస్ సర్వర్‌లో ఆమె ఓ మాల్వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసినట్లు గుర్తించి, విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.