India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధుల్లో ఉండే ఆర్మీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు తమ ఓటును వేరే వ్యక్తితో(ప్రాక్సీ) వేయించే సౌకర్యం ఉంటుంది. ఇందుకు 13F ఫారం సమర్పించాలి. ఓటరు డ్యూటీ స్టేషన్‌లో ఉంటే ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టి తన ఓటు వేసేందుకు ఎంచుకున్న వ్యక్తికి పంపాలి. అతను నోటరీ లేదా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట సంతకం పెట్టి ROకు ఇవ్వాలి. ఓటరు హోమ్ టౌన్‌లోనే ఉంటే నోటరీ/మేజిస్ట్రేట్ ముందు సంతకం పెట్టి ROకి పంపాలి.
ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పలు సందర్భాల్లో వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. కేసు విచారణ ప్రారంభం కాకపోవడం వల్ల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, 1951 కింద వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వీరు ఓటు వేయొచ్చు. అయితే పోలింగ్ తేదీకి కనీసం 15 రోజుల ముందు రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమచారం ఇవ్వాలి. కస్టడీలో ఉన్న ప్లేస్ నుంచి పోస్టు ద్వారా ఓటును పంపిస్తారు. <<-se>>#Elections2024<<>>
BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆమె వాదనలు విన్న ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఈమేరకు తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
AP: మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చిన ఘనత తమదేనని సీఎం జగన్ చెప్పారు. మంగళగిరి సభలో ఆయన మాట్లాడారు. ‘పేదల బతుకులు మారాలనే లక్ష్యంతో అడుగులు వేశాం. 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. అక్కాచెల్లెళ్ల పేరుతో 31లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. పౌరసేవల్ని ఇంటి వద్దకే తీసుకొచ్చాం. ఇంతటి జవాబుదారీ ప్రభుత్వం గతంలో ఉందా? 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాడా?’ అని నిలదీశారు.
CSK మాజీ కెప్టెన్ ధోనీకి కొత్త గాయమేమీ కాలేదని కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు. ‘IPL-2024 సీజన్ ముందు నుంచే ధోనీ కండరాల గాయంతో బాధపడుతున్నారు. అందుకే వర్క్‌లోడ్ తగ్గించేందుకు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి పంపిస్తున్నాం. ఆయన ఫీల్డ్‌లో ఉంటే కొత్త కెప్టెన్‌కు విలువైన సలహాలు ఇస్తారు. అది మాకు చాలా ముఖ్యం. అందుకే రిస్క్ తీసుకోవట్లేదు’ అని చెప్పారు. గతేడాది ధోనీకి మోకాలి సర్జరీ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
AP: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి పనులను ఆపాలని తెలిపింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి, తనిఖీ చేయాలని సూచించింది. కాగా అక్రమ మైనింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీన్ని ధర్మాసనం తోసిపుచ్చింది.
నియంత్రణ లేకుండా సమాజానికి విఘాతం కలిగించేలా ప్రసారాలు చేస్తోన్న యూట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన సమయం వచ్చిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సవుక్కు శంకర్ అనే వ్యక్తి మహిళా పోలీసు సిబ్బందిపై అవమానకర ప్రకటనలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా ఫెలిక్స్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
TG: రాష్ట్రంలో గత 3 రోజులుగా వాతావరణం చల్లబడటంతో ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచారు. అయితే పోలింగ్ జరగనున్న ఈనెల 13న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పోలింగ్ శాతంపై వర్షాలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
నెల్లూరు(D) ఆత్మకూరులో ప్రతిష్ఠాత్మక పోరు నడుస్తోంది. మాజీ CM బెజవాడ గోపాలరెడ్డి గెలిచిన గడ్డ ఇది. ఇక్కడ CONG 9సార్లు, TDP 2, YCP (బైపోల్ సహా) 3సార్లు నెగ్గాయి. 2009లో ఇక్కడ MLAగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పదేళ్ల తర్వాత తిరిగి ఇక్కడ TDP నుంచి బరిలో నిలిచారు. గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కలిసొస్తాయని ధీమాగా ఉన్నారు. YCP తరఫున సిట్టింగ్ MLA మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
సైనిక చర్యలతో పాకిస్థాన్‌ను కవ్వించాలని చూస్తే అది భారత్‌కే నష్టమని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలకే భారత్ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వద్ద కూడా ఆటమ్ బాంబులు ఉన్నాయి. లాహోర్‌పై ఆటమ్ బాంబు వేయాలని చూస్తే అమృత్‌సర్‌కు 8 సెకన్లలో రేడియేషన్ పాకుతుంది. మనం గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. రెచ్చగొడితే వారు మనపై అణుబాంబు వేయొచ్చు’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.