India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా ధోనీ ప్రస్థానం ముగిసింది. అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే సారథిగా, ప్లేయర్‌గా ధోనీ తప్పుకున్నారు. తాజాగా CSK కెప్టెన్‌గానూ అదే విధంగా వైదొలిగారు. దీంతో ఆయనకు ఇదేం కొత్త కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కెప్టెన్సీలో సీఎస్కే సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.
IPL: చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్సీ మార్పుపై CSK ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. IPL-2024లో రుతురాజ్ సారథ్యం వహిస్తారని పేర్కొంది. ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను గైక్వాడ్‌కు అందించారని తెలిపింది. కాగా, కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే మహి పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్‌లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసల పర్వం మొదలైంది. 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ, ఈసారి గెలిచి తీరాలని అనుకుంటున్న ఇండియా కూటమినీ ఫిరాయింపులు వెంటాడుతున్నాయి. బిహార్‌లో ఒక్క సీటూ ఇవ్వలేదని RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి NDA నుంచి వైదొలిగారు. ఈయన కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉంది. మరోవైపు పలువురు కీలక BJP నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన మాజీ ఎంపీ చౌదరీ లాల్, ఝార్ఖండ్ సిట్టింగ్ MLA జై ప్రకాశ్ పటేల్ ఇటీవల BJP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. BSP నేత, BJP కోవర్ట్ అని ఆరోపణలు ఎదుర్కొన్న UP ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. బిహార్‌లో ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రాజేశ్ రంజన్/పప్పు యాదవ్ తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అస్సాంలో బీజేపీ నేత అమీనుల్ హక్ లస్కర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ చేరికలు కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీలోనూ అదే స్థాయి చేరికలు ఉంటున్నాయి. రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన 15 మంది కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళలో కాంగ్రెస్ కీలక నేత మహేశ్వరన్ నాయర్ సహా మధ్యప్రదేశ్‌లో 8 మంది ఇటీవల హస్తాన్ని వీడి కమలాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పోరు ఆసక్తిగా మారనుంది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు సీఎస్కే అనుహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను మార్చింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్లు పాల్గొన్న ఫొటో షూట్‌లో ధోనీ స్థానంలో గైక్వాడ్ వచ్చారు. చెన్నైకి రుతురాజ్ కెప్టెన్ అని IPL ట్విటర్ అకౌంట్‌లో అధికారికంగా ప్రకటించారు. పంజాబ్ జట్టుకు జితేశ్ శర్మ వైస్ కెప్టెన్ అని తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించింది. సీరియల్ నంబర్లతో కూడిన డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది. దీని వల్ల ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవి, ఎంఎం కీరవాణిలతో త్రిష ఫొటో దిగారు. దానిని ట్వీట్ చేసిన ఆమె ‘లెజెండరీలతో దివ్యమైన ఉదయం’ అని క్యాప్షన్ ఇచ్చారు.
TG: ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదు జమ రేపు పూర్తి చేస్తామని చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదలమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.