India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ నిన్న రాత్రి తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లారు. బ్లాక్ ఔట్‌ఫిట్‌తో వీరు బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరి క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్ను నమ్మని వాళ్ల కోసం ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు.. అది నాటిన వాళ్లకే నీడనిస్తుందా అని. నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడుపుతుందని. అప్పట్నుంచి అడగటం మానేశా. అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టా’ అని నాగబాబు పోస్ట్ చేశారు.
చైనా సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు వివాదాలపై సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం ఉంటేనే ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ సాధ్యమవుతుందన్నారు. బోర్డర్‌లో ఘర్షణ వాతావరణం ఉన్నా చైనాతో వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘2014కు ముందు తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది’ అని పేర్కొన్నారు.
తెలుగులో ‘త్రినయని’ సీరియల్‌తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్ మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కన్నడలో ‘రోబో ఫ్యామిలీ’ అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో మొదటగా ‘నిన్నేపెళ్లాడతా’ అనే సీరియల్‌లో నటించారు.
ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్‌సీట్లుగా మారాయని సమాచారం.
TS EAPCET ప్రిలిమినరీ ‘కీ’లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కీ, రెస్పాన్స్ షీట్స్‌తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను <
AP: మే 13న జరిగే ఎన్నికల్లో ఓటరు ఐడీ లేకున్నా ఓటు వేయవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆధార్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, MGNREGA జాబ్ కార్డు, పెన్షన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ కార్డులు, UDID కార్డు, MP/MLA/MLCలకు ఇచ్చే కార్డులు, RGI స్మార్ట్ కార్డు చూపించి ఓటు వేయవచ్చు. ఓటర్ స్లిప్ మాత్రం పక్కా.
కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ(92) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏప్రిల్ 29న ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు ICUలో చికిత్స అందిస్తున్నారు. కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేశారు. విదేశాంగమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుని 2017లో బీజేపీ గూటికి చేరారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
IPL-2024లో MI ఓడిన తీరు స్టోరీ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తుందని కామెంటేటర్ హర్షా భోగ్లే అన్నారు. ‘చాలా మంది ముంబై ప్లే ఆఫ్స్‌కి వెళ్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీనిని మనం టీమ్‌ఇండియా కోణంలో చూస్తే కోచ్ ద్రవిడ్ వెంటనే చేయాల్సిన పని ఒకటి ఉంది. జట్టులో కీలక ప్లేయర్లయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య సఖ్యత తీసుకురావాలి. ముఖ్యంగా వారిని త్వరగా ఫామ్ అందుకునేలా చేయాలి’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. 425 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి 45 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.