India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్ ప్రశాంతి సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. అటు ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంలోనూ సెలవు ఇచ్చారు.
TG: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు వందల కుటుంబాలను తీవ్ర దు:ఖంలో ముంచాయి. ఖమ్మం, పాలేరు, తిరుమలాయపాలెం, మహబూబాబాద్ ప్రాంతాల్లో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో కుండపోత వర్షాలు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. పెళ్లిళ్ల కోసం తెచ్చుకున్న సామగ్రి, కట్న కానుకలు, దుస్తులు, బియ్యం, ఇతర కిరాణా సామగ్రి, పట్టు చీరలు, నగలు, వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఒక్కొక్కరు రూ.లక్షల్లో నష్టపోయారు.
TG: కొత్త పద్ధతుల్లో చేనేత శిక్షణ ఇచ్చేందుకు నెలకొల్పిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT)ను నేడు CM రేవంత్ ప్రారంభించనున్నారు. ఈమేరకు నాంపల్లిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో CM పాల్గొంటారు. దేశంలో 6 ప్రాంతాల్లోనే IIHTలున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో ఏటా 60మంది విద్యార్థులకు చేనేత, టెక్స్‌టైల్స్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 48 మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అయితే ఎంత మంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు. సరైన రైల్వే వ్యవస్థ లేకపోవడంతో నైజీరియా రహదారులపై ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. 2020లో 1,531 ప్రమాదాలు జరగగా 535 మంది మరణించారు.
TG: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని, ఉదారంగా సాయం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనుంది.
AP: బుడమేరు పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో ఏ క్షణంలోనైనా వరద వచ్చే అవకాశం ఉందని విజయవాడ నీటిపారుదల అధికారులు తెలిపారు. గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయన్నారు. ఒకవేళ వరద వస్తే ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు.
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఇవాళ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించనుంది. ఈ సారి ఏఐతో కూడిన ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు రంగుల్లో వీటిని అందించనుంది. ఈ ఫోన్లు పలుచగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాలకు హాలిడే ప్రకటించారు. సెలవు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య SEP 15న వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 2 నగరాల మధ్య 578KM దూరాన్ని ఈ రైలు 7.15 గంటల్లోనే చేరనుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం నాగ్‌పూర్‌లో ఉ.5 గం.కు బయల్దేరి మ.12.15 గం.కు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మ.1.గం.కు SCలో బయల్దేరి రా.8.20 గం.కు నాగ్‌పూర్ చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, WGL, ASF, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.