India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సద్గురుకు జరిగిన ఆపరేషన్‌పై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ‘తలనొప్పిగా ఉందని సద్గురు ఈనెల 15న ఆస్పత్రిని సంప్రదించారు. MRIలో పుర్రె (ఎముక), మెదడు మధ్య రక్తస్రావమవుతోందని తెలిసింది. 17వ తేదీన తలనొప్పి తీవ్రమై వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే అత్యవసర ICU బృందం ఆయనకు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేసింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎప్పటిలా ఆయన జోక్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు’ అని తెలిపారు.
మథురలోని షాహీ ఈద్గా మసీదులో కృష్ణకూప్ వద్ద ప్రార్థనలు చేసేందుకు హిందువులు అలహాబాద్ హైకోర్టును అనుమతి కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ముస్లిం వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో మరో విజ్ఞప్తిని తీసుకోరాదని వాదించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే 1వ తేదీకి వాయిదా వేసింది. కాత్రా కేశవ్ దేవ్ ఆలయంపై మసీదును కట్టారనేది హిందువుల వాదన.
2026కల్లా రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.
అయోధ్యలో రామమందిరంలా బిహార్‌లో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. సీతాదేవి జన్మస్థలంగా భావించే సీతామడీ జిల్లాలో ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి విరాళాలు సేకరించనుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో సీతమ్మ కోసం కొత్త ఆలయ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది సినీ నటుడిగా రికార్డులకెక్కారు. బన్నీ తర్వాత విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 M), దుల్కర్ సల్మాన్ (14.1 M), యశ్ (13.5 M), మహేశ్ బాబు (13.4 M), ప్రభాస్ (11.7 M), దళపతి విజయ్ (10.8 M) ఉన్నారు.
AP: ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న టీడీపీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై నేతలకు సూచనలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. కాగా రెండు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
TG: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో పెద్దపల్లి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్ ఉన్నాయి. ఖమ్మం, WGL, కరీంనగర్, NZB, భువనగిరి, మెదక్, HYD అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జపాన్‌లో తాము ఉన్న హోటల్ వద్ద భూకంపం వచ్చినట్లు SS కార్తికేయ ట్వీట్ చేశారు. ‘జపాన్‌లో ఇప్పుడే భయంకరమైన భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులో ఉన్నాం. భూమి కంపించడం ప్రారంభించింది. భూకంపం అని గ్రహించి భయాందోళనకు గురయ్యా. కానీ, చుట్టుపక్కల ఉన్న జపనీయులు పెద్దగా పట్టించుకోవడం లేదు. భూకంప అనుభూతిని పొందా’ అని తెలిపారు. ఆయన RRR స్పెషల్ షో వీక్షించేందుకు రాజమౌళితో వెళ్లినట్లు తెలుస్తోంది.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ఉన్న 3 మద్యం దుకాణాలు లూటీకి గురయ్యాయి. అధిక ధరకు మద్యం అమ్ముతున్నారనే కారణంతో ప్రజలు ఈ దుకాణాలను లూటీ చేశారు. 3 షాపుల యజమానులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన కస్టమర్లు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రూ.22 లక్షల విలువైన మద్యం మాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్‌గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. గాడ్జిల్లా, అవెంజర్స్ వంటి సినిమాల్లో ఇతను నటించారు. ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ చేస్తారని హాలీవుడ్ టాక్.
Sorry, no posts matched your criteria.