India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
JEE మెయిన్ పేపర్-2కి సంబంధించి సెషన్-2 ఫలితాలను NTA విడుదల చేసింది. ఈ రిజల్ట్స్‌ను https://jeemain.nta.ac.in./ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్లానింగ్ పేపర్‌లో ఏపీకి చెందిన కొలసాని సాకేత్ ప్రణవ్, కర్ణాటకకు చెందిన అరుణ్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఆర్కిటెక్చర్ పేపర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన సులగ్న బాసక్, తమిళనాడుకు చెందిన ఆర్.ముత్తు 100 ఎన్టీఏ స్కోర్ పొందారు.
TG: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేయడంతో AAI అధికారుల్లో కదలిక వచ్చింది. త్వరలో వారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం 706 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా.. 400 ఎకరాలు కావాలని AAI అధికారులు కోరుతున్నారు. అటు పూర్తిస్థాయిలో ఎయిర్‌పోర్టు నిర్మించాలా? లేక దశల వారీగా నిర్మించాలా? అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం స్పష్టత రానుంది.
TG: ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని.. AICTE ఇచ్చిన గడువులోగా ప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. యాజమాన్య కోటా సీట్లను ఇష్టానుసారంగా అమ్ముకోకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలోనే అతి పెద్దదైన, ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో ఏర్పాటైంది. దాదాపు 200ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రైతులు, వ్యాపారులు, ఎగుమతి దారులు, పారిశ్రామిక వేత్తల కార్యకలాపాలకు ఇది వేదిక కానుంది. ఇందులో వివిధ కంపెనీలతో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా 25వేల మందికి ఉపాధి లభించనుంది.
AP: ఖరీఫ్ సీజన్‌లో గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా అదనపు బాధ్యతలు అప్పగించింది. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లకు అదనంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. విత్తనాలు సమర్థవంతంగా, వేగంగా పంపిణీ చేసేందుకు వీరి సేవలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ ఈసెట్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ శంకర్ తో తాను చేస్తున్న ‘ఇండియన్-2’ సినిమా జులైలో రిలీజ్ అవుతుందని విశ్వనటుడు కమల్ హాసన్ తెలిపారు. ఇది రిలీజైన 6 నెలలకు ఇండియన్-3ని థియేటర్లలోకి తీసుకొస్తామన్నారు. కథ పెద్దది కాబట్టి మూడో పార్టును రూపొందించామని పేర్కొన్నారు. జూన్ 1న ఇండియన్-2 ఆడియోను లాంచ్ చేస్తామన్నారు. కాజల్, సిద్దార్థ్, రకుల్ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
APలో సీ ప్లేన్ టూరిజానికి పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ, కాకినాడ, రుషికొండ, లంబసింగి, కోనసీమ, విశాఖ ప్రాంతాల్లో సేవలు అందించనుంది. జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ హౌస్ బోట్లతో సీ ప్లేన్ టెర్మినల్ నిర్మించనుంది. 9-10 మంది సామర్థ్యంతో కూడిన 2 ఫ్లోటింగ్ ప్లేన్లను రోజూ నడపనుంది. నీటిలో ఈ ప్లేన్లు ఎక్కి.. గాల్లో తిరుగుతూ AP పర్యాటక అందాలను ఆస్వాదించవచ్చు.
IPLలో నేడు మ.3:30కి పంజాబ్‌తో SRH, రాత్రి 7:30కి KKRతో రాజస్థాన్ తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానం ఎవరిదో ఇవాళ తేలిపోనుంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న RR కోల్‌కతాపై గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఆ జట్టు ఓడిపోయి, PBKSపై SRH గెలిస్తే 17 పాయింట్లతో హైదరాబాద్ రెండో స్థానానికి వెళ్తుంది. తొలి స్థానంలో KKR, మూడో స్థానంలో RR, నాల్గో స్థానంలో RCB ఉంటాయి.
తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ఈనెల 22 తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. వచ్చే 3 రోజులు ADB, కొమురం భీం, ములుగు, భద్రాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, HYD, మేడ్చల్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, NLG, NZB, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, జనగామ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.